Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యసభ పూర్వ సభ్యులు, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు , జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ గౌరవ స్వీకర్త , కేంద్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యులు మహాకవి డా|| సి.నారాయణ రెడ్డి గారు ఈ రోజు భౌతికంగా మనమధ్య లేరనే కఠోర సత్య నమ్మశక్యం కానిది, జీర్ణించుకోలేనిది. సినారే ఆకస్మికంగా 12 -06 -2017 న పరమపదించడం వారి కుటుంబంతో పాటు, ప్రపంచ నలుమూలల వున్న వారి అసంఖ్యాక అభిమానులకు ఎన్నటికీ తీరని సంతాపం కలిగించింది. డా|| సి.నారాయణ రెడ్డి గారు తమ అసమాన కావ్యాల ద్వారా సాహిత్యాన్ని సుసంపన్నం చేసినట్టే అయన వహించిన వివిధ ఉన్నత పదువులకు ఎంతో వన్నె చేకూర్చి ఘన విజయాలు సాదించినవారు. ఆ విశ్వకవికి సాహితి జగతి వందనం అర్పిస్తూ, ఆ మహామానిషి దివ్యస్మృతికి వినమ్రంగా శ్రద్ధంజలి ఘటిస్తున్నది.
తెలుగు సంతకం-సినారె
లాలీ..లాలీ....లాలీ...అంటూ జోలపాడి
తెలుగుపాటకు అమ్మైన
మా"ఙ్ఞానపీఠం"సినారె లేడంటే ఎట్లా నమ్మాలి?
నన్ను దోచుకుందువటే ....అని పలువరించి
తెలుగుజాతి హృదయాలను దోచుకున్న
ఆ "వన్నెల దొర"లేడంటే ఎట్లా నమ్మాలి?
సిపాయీ..ఓ సిపాయి అంటూ గానంచేసి
తెలుగుభాషను కాపాడిన
ఈ "కరీంనగరు సిపాయి" లేడంటే ఎట్లా నమ్మాలి?
హన్మాజిపేటకు
అంతర్జాతీయ ఖ్యాతిదెచ్చిన
ఆ "విశ్వాంభరుడు "లేడంటే ఎట్లా నమ్మాలి?
సినారె ఇకలేడని చెప్పకండి
వినేశక్తి చెవులకున్నా
తట్టుకునే శక్తి గుండెకు లేదు....
సినారె ఇకలేడని చెప్పకండి
సినారె ఎక్కడికీ పోడు
"తెలుగు "అనే మూడక్షరాలున్నంత వరకు
"సినారె "అనే మూడక్షరాల సంతకం కూడ ఉంటుంది
మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను,
నేనేమంటాను
పాలు పట్టి జోలపాడి పడుకోమంటాను
వికసించ్చిన కుసుమం నిలిచేది ఒక రెనాల్లాంటాను
వెల్లకిందని మురిపం మెలిగేది ఒక మెర్నర్దంటాను.
సినారెపాట
బాటసారికి దాహం తీర్చే చలివేంద్రం
సినారె పరిశోధన
ఎందరికో చీకటిలో లాంతరు
సినారె కావ్యాలు
తెలుగుతోటలో వాడనిపూలు
సినారె సంతకం
సాహితీఆకాశంలో ధ్రువతార.
- జటావత్ మునినాయక్
ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్
7659888655
(గ్రామము) జాల్ తండా (పోస్ట్ )నెల్లికల్, తిరుమలగిరి సాగర్ (మండల )నల్గొండ (జిల్లా)508202.