Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాల్ దర్వాజా సింహవాహిని!
లాల్ దర్వాజా సింహవాహిని!
కొలువయితివి నగరాన
భక్తుల కోర్కెలు తీర్చగ
తల్లీ నీకు శతకోటి వందనాలు!!
ప్లేగు వ్యాధి అంతటా ప్రబలిన నాడు
దేశమంతా అతలాకుతల మయిన నాడు
మూసీ నదీ వరదల లోనూ వేలాది ప్రాణాలు నీటమునిగితే
మాకు నీవే దిక్కు అంటూ మొక్కేము!
మా మొర ఆలకింప నేనున్నానంటూ
మము రక్షింప సింహ వాహిని వై అరుదెంచావు !!
కష్టాల కడలిలో మునిగే వారిని సుఖాల దరిని చేర్చావు!
కూడు గూడు నీడ లేని వారికి అండ దండగా నిలిచావు!
దీపకాంతుల తోరణాల ఆలయ ప్రాంగణం లో
స్వర్ణాభరణాల కాంతులలో పీతాంబరాల జీలుగుల్లో
కళ కళ లాడే నీ మోము చిరునవ్వులు చిందింప
విరాజిల్లె ప్రసన్న వదనం సుందరం నీ నిండైన విగ్రహం
నిను చూడ వెయ్యి కనులు చాలవు!
వేద ఘోషల నడుమ
కుంకుమార్చనలు జరుప
ఉపనిషత్తులు విప్రులు చదువ
నిత్యమూ భక్తులు నిను పూజింప
నిత్య నైవేద్యాలూ సమర్పింప
కాళీవై దుష్ట శక్తులు పారద్రోలెదవు!!
పోతురాజులు ముందు నడువ
రంగు రంగుల ఘటాలతో మహిళలు వెంట నడువ
మధురమైన తియ్యని గూడాన్నములతో
మా శక్తి కొలది బోనాలు సమర్పించేము
మహిమగల తల్లీ! అంగరంగ వైభవంగా పండుగ చేసేము
మా పిల్లపాలను చల్లగా చూడుమమ్మా
మహంకాళీ! నీ మహిమలు పొగడతరమా!!
లాల్ దర్వాజా మహంకాళీ! ఉజ్జయినీ మహంకాళీ!!
మీరు నగరాన్ని మీ కనుసన్నలల్లో కాపాడేరమ్మా
మీ అక్కాచెళ్ళతో కూడి ప్రతి ఏటా
మీ పుట్టింటికి ఆషాడ మాసాన వచ్చేరు!
మేము ఆనందంతో మీకు బోనాలు సమర్పించేము!!
( అమ్మవారి బోనాలు .. ఆ సందర్భంగా )
- కె.మణి
9703044410