Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతను వదిలివేసిన గురుతులను చెరిపేయలేను
అతను దిద్దిపోయిన నవ్వులను తుడిచేయలేను
కష్టాలతో సహవాసం చేసే జీవితమిది
తనకోసమే నా సమయాలను గడిపేయలేను
ఎన్నో బాధ్యతల బరువుల్లో మునిగిపోయాను
పనిగట్టుకొని దరహాసాలను పూయించలేను
బాధనంతా మోస్తూనే తిరుగుతూ వున్నాను
అయిన గానీ అతని ఊహలను వదిలేయలేను
సుధను వదిలేసి వెళ్ళకని గిరిగీయలేదుగా
అదేపనిగ జ్ఞాపకాల బరువులను మోయలేను
-సుధా మైత్రేయి
9989042236