Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న ఊరైన చిన్న గూడూరు నుండి
మట్టిలో మాణిక్యంలా మిలమిలా మెరిసిన
మధుర కవీ - దాశరథీ కృష్ణమాచార్యా !
ధన్యమైనది మా జన్మ మీ కవితావనంలో
కుసుమాలమైనందుకు అక్షరాన్ని ఆయుధంగా
మలచుకొని అణచివేత చీకట్లకు పాతరవేస్తూ
స్వేఛ్చా కిరణాలకు ప్రాణం పోసిన మహాకవీ - ఓ మా దాశరథీ !
పద్యాలతో, గేయాలతో, గజల్స్ తో తెలంగాణ గుండె చప్పుడు
నైజాంకు వినిపించి అరుణారుణ పతాకం
ఎగురవేసి విప్లవ సాహిత్యాన్ని వీధి వీధినా వికసింపచేసిన
విప్లవ వీరుడా - ఓ మా దాశరథీ !
పేదరికంలోను, ఆకలిమంటలలోను
ఆత్మస్థైర్యాన్ని కోల్పోని అమరవీరుడా
నా పేరు ప్రజా కోటి - నా ఉరు ప్రజా వాటి అంటూ
తెలంగాణ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా
నా తెలంగాణ కోటి రతనాల వీణ
అని తెలంగాణపై ఉన్న మక్కువను
ప్రపంచానికి చాటిచెప్పి నల్లటి ఆకాశాన్ని చీల్చుకువచ్చిన
సూరీడా కళాప్రపూర్ణా - ఓ మా దాశరథీ !
మా నిజాం రాజు - జన్మ జన్మాల బూజు అంటూ
నియంతృత్వపు కోటగోడలను
కూకటి వేళ్ళతో పెకిలించి రజాకార్ల రాళ్ళను పువ్వులుగా
స్వీకరించి తెలంగాణకు సాహితీసంపదనందించి
తెలంగాణ కవితాపితామహునిగా
తిమిరంపై సమరం చేసిన
నవకవితాజలధీ - ఓ మా దాశరథీ !!
-కాళంగి.వసంత జెస్సన్
ఖమ్మం
చరవాణి:9490967433