Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ని ధార పారించె
రుద్రవీణ మ్రోగించె
నిజామోని గుండెల్లో
అక్షర విల్లెక్కుపెట్టె
తన ఆవేశానంతా
సిరా చుక్కగా మార్చి
కాగితాలు ఎరుపెక్కగ
కవితలెన్నొ రచియించె
తన గొంతును వినిపించగ
జైలు గోడలడ్డు రాలె,
బోలెడు కవితల రాసె
బొగ్గు ముక్క తోడుండగ
దగాకోరు బడా చోరు
రజాకారు పోషకున్ని
దిగి పొమన్ని నినదించిన
ధీశాలి దాశరథి..
- యస్. విఘ్నేశ్వర్ గౌడ్
సెకండరీ గ్రేడ్ టీచర్
ప్రాథమిక పాఠశాల మహేశ్వరం,
రంగారెడ్డి
9490122637