Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి:
.సింగిరెడ్డి సినారే తెలుగు వారి సిరి నీవే
సింగిరెడ్డి సినారే తెలుగు వారి సిరి నీవే
వీధి బడిన చదివిన విజ్ఞాన గని వీవే
చరణం 1:
పాట లైన గజలైనా బుర్ర కథలే ఐనా
పద్యాలు గద్యాలు ప్రక్రియ లేవైనా
అలవోకగా వ్రాసి మనసులనే దోచి
ధ్రువ తారగ నిలిచిన ఘనుడీవె సినారే
చరణం2
పగలే నింగిలో వెన్నెలను పంచి
జగతినే అందమైన ఊయలగా మార్చి
లాలి పాట పాడి నిదుర బుచ్చుచూ
తెలుగు భాష గరిమను దశదిశలా చాటిన
చరణం:3
నేలకు గాలికి కులమేదని ప్రశ్నిస్తూ
జీవమున్న మనిషి కన్నా శిలలే మేలంటూ
విశ్వాసం లేనిమనిషి కన్న శునకమే మిన్నని
గళమెత్తి చాటిన స్రష్టవు నీవు స్రష్టవు నీవు
చరణం:4
అమ్మను దైవంతో అన్నను పెన్నిధిగా
నాన్న మనసు వెన్నంటూ చాటుతూ
స్నేహమే జీవితమని చెలిమి విలువను
శుక పికాల పాట ద్వారా తెలిపిన సినారే
చరణం:5
భరత మాత మెడలో పచ్చల హారమైనావు
తెలుగు తల్లి సిగలోన కలికి తురాయైనావు
జ్ఞానపీఠ పురస్కారమందిన ఓ సినారే
సరి ఎవ్వరయ్య నీకు సాహితీ జగతిలో
----డా.బల్లూరి ఉమాదేవి