Authorization
Thu March 06, 2025 02:28:20 am
అక్షరాలతో కనువిందు
అమరిక కలం
శాంతి కోసమే తపించింది
మానవతను మేల్కొలిపింది
వన్నెల దొరసానితో
సినీ రంగంలో అడుగు
ఊహించని మలుపు తిరిగింది
విశ్వ పరిణామాన్ని వివరించిన కలం
విశ్వంబరం జ్ఞానపీఠాన్ని అధిరో హించి
అక్షరంతో ప్రయోగం చేసి
అందమైన గజళ్లు కట్టి
హృదయ రాగాలు విప్పింది
పంచ పాదాలతో అనుభవం గజ్జకట్టి
ప్రపంచపదులు అయింది
మాట్లాడిన ప్రతి పదం
సాహిత్యం అయ్యింది
బుచ్చమ్మ మల్లారెడ్డిల వరసంతానం
హన్మాజిపేట పల్లె పదాలతో వ్రేళ్లూనింది
ఆధునిక ఆంధ్ర పరిశోధకుడు ఆచార్యుడు
చట్ట సభలో సాహిత్య సంస్థలలో
సభాసరస్వతి ప్రాంగణాల్లో
ధ్వనించిన గళం
తెలుగు తనానికి నిలువెత్తు సంతకమై
తెలుగు భాష ఉన్నంత వరకు
ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది
-కడారి సాయిసురేష్
వేములవాడ
చరవాణి : 8639925732