Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహితీ సమరశంఖం
సంస్కృతాంధ్ర భాషా పాండిత్యములో ప్రవీణుడు
పద్యరచలలో ఆరితేరిన సరస్వతీ పుత్రుడు
రజాకర్ల అణచివేత పై గర్జించిన సాహితీగాంభీర్యం
గాలిబ్ గీతాలతో అలరించిన మధురలాలిత్యం
పద్యశరాల మహిమాన్విత అస్త్రాలుగల ధీరుడు
నిజాం పాలన పై ఎక్కుపెట్టిన అగ్నిధరుడు
అరాచక పాలనపై వేలెత్తిన పోరు వీరుడు
పీడిత ప్రజలకై స్పందించిన ఉద్యమ శూరుడు
కలం కరవాలముతో పూరించిన సమరశంఖం
అభ్యుదయ చైతన్య కవిచక్రవర్తి స్ఫూర్తీవ్యూహం
అక్షరాయుధాలతో తిమిరంపై సాగించెను సమరం
జైలుగోడలపై రుద్రవీణ మ్రోగించిన క్రాంతి పథం
భావప్రేరిత ప్రసంగాల ఉత్తేజపు గొంతుక ప్రవాహం
సాహితీ లోకాన చిరంజీవిలా నిలిచిన ప్రకాశం
... విశ్వైక
కవయిత్రి
95501 83143