Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహితీ వనంలో వికసించిన కుసుమ రాజమా!
సౌరభాలు వెదజల్లే సహస్ర కిరణమా !
సంగీత సాహిత్య సమలంకృతా !
యువకవుల హృదయాలయాల నిలయమా !
వీథిబడి నుండి జ్ఞానపీఠమెక్కిన
తొలి తెలంగాణ సమున్నత సాహితీ శిఖరమా
సరిలేరు మీ కెవ్వరూ మా సినారే
శృతి నీవు , గతి నీవు , శరణాగతి నీవు కవితావనికే
మరణం పైన రణం ప్రకటించి
మరణానికి జోలపాడే మీ కవిత్వం
సినారె కలం నుండి జాలువారిన కవితలు
పాటలు , మాటలు , నాటికలు , గజల్స్ , ఒకటేమిటి
ఒక్కొక్క సిరాచుక్క సహస్ర కవులై స్పందించవా
కలం కదలనిదే కాలం కదలదని
ఊపిరాడలేదంటే కవితరాయలేదని
తెలిసేలోపు మూసుకుపోయె కవిత్వపు తలుపులు
వాడిపోయి పండిపోయి రాలిపోయె
అనుబంధం , ఆత్మీయత అంతా ఒక బూటకం అని
కవితాలోకాన్ని శోకసంద్రంలో ముంచివేసినారా
ఏవీ ఆ కర్పూర వసంతాల గుభాళింపులు
ఏవీ ఆ సుమధురగానాల మందాకినీ ప్రవాహాలు
మూగబోయె మీ మృధుమధుర స్వరాలు
అజరామరం మీ మరణం
మీకిదే మా అక్షర సంస్మరణం !!
- కాళంగి.వసంత జెస్సన్
5-1-292,యస్.పి.ఆఫీస్ రోడ్,
ఖమ్మం,తెలంగాణ
చరవాణి:9490967433
మెయిల్: vasantha.kalangi@gmail.com