Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సువిశాల సాహిత్య కవితల మారాజు
గంధర్వ తారా తేరులో గజల్స్ రేడు
అనంత లలితగీతాల తరాజు
సినీ వినీలాకాశంలో పాటల రారాజు
సాహిత్య సరస్వతి అనుంగు సుతుడు
దేశ విదేశ బిరుదులు గడించిన కళాపూర్ణుడు
అంబరానికి ఎదిగిన పద్మభూషణుడు
అపార పాండిత్య పటిమగల జ్ఞానపీఠుడు
శబ్ధాలకు రంగు రుచి వాసన లద్దే
అసామాన్య శబ్ధస్ఫూర్తి
రాస్తూ రాస్తూ పోతాను పోతూ పోతూ రాస్తాను
అన్న సాహిత్య శ్వాసతో నడిచిన అద్భుతకీర్తి
హృదయాంతరాలలో ఆయన పాటలు
చైతన్య జలపాతాలు
తెలుగు తల్లి కిరీటంలో మెరుపు లీనే
వజ్రపు తణుకులు
పగిలిన గుండె చప్పుడుతో కవితలల్లిన అభ్యుదయ కవి
విలక్షణ ప్రక్రియలతో ఓలలాడించిన
సాహితీ ఠీవీ
నిరంతర ప్రయోగశీలి బహుముఖప్రజ్ఞాశాలి
అధికార భాషా సంఘ అధ్యక్షునిగా
గౌరవనీయ రాజ్యసభ సభ్యునిగా
గొప్ప పదవులు చేపట్టిన దిట్ట
విశ్వంభర వీణను మీటిన సినారే
సాహితీ కవనవనాన మీ సేవ భళారే!
- విశ్వైక
సినీ గేయరచయిత్రి