Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారె
మాటలనే పాటలుగా మలచిన సినారె
సినారె లేనిదే సాహిత్యం లేదు
పల్లవి లేనిదే చరణం లేదు
కంటి మీద కునుకు లేకుండా
సాహిత్యానికే తన ప్రాణం అంకితం చేశారు
సాహిత్యానికే తన ప్రాణం అంకితం చేశారు
సాహితీ పిపాసకులు
ఆణిముత్యాల్లాంటి పాటలు రాసి
సాహితీ లోకానికి ఓ ధ్రువతారగా నిలిచారు మహానుభావులు
విలువలతో కూడిన పాటలు రాసి విజేతగా నిలిచిన
మన విశ్వంభరుడు సినారె
సాహితీ వ్యవసాయంలో అక్షరాలను వెదజల్లి
సాహితీ ఫలాలను అందించిన నిరంతర సాహితీ కృషీవలుడు
తెలుగు పదాల మాంత్రికుడు
తెలంగాణ మాగాణంలో సాహితీ కుసుమం
సాహితీశిఖరం, నిరంతర కవి, నిశ్చల రవి సినారె ఒక్కరే!
- బ్రాహ్మండ్ల పల్లి రవీంద్రా చారి (గవర్నర్ అవార్డ్ గ్రహీత)
ఓదెల గ్రామం,మండలం,పెద్దపల్లి జిల్లా-505152