Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితాన కవిత్వమే ఊపిరిగా ఎదిగినారు
అభిమానులు గురువంటూ ప్రేమగా కొలిచినారు
మీ పాట వెంట ప్రణయము మాటలలో మధురము
జనమంత ముగ్థులై సినిమాకవిగా మెచ్చినారు
తెలుగు సౌరభాలు పంచే గేయకావ్యాలు రాసి
తెలంగాణా ఘనతను గొప్పగా చాటినారు
మార్పు నా తీర్పనీ కాలంతో సవాలు చేస్తూ
రచనల్లో భావికవులకు స్ఫూర్తిగా నడిచినారు
శ్రోతలపై సరసభావనా చమక్కులు చిలకరిస్తూ
మందహాసంతో మహావక్తగా భాసిల్లినారు
అన్యాయాన్ని ప్రశ్నించేటి గొంతుకే అయినా
అందరి నేస్తమై అజాత శత్రువుగా గెలిచినారు
మిమ్ములను వరించాలనీ పదవులకెంతో ఆశ
పరిణత కలిగి పాలనాదక్షులుగా సాగినారు
విశ్వంభర రచించి జ్ఞానపీఠాన్ని సాధించి
సాహితీ లోకాన మేరు శైలంగా నిలిచినారు
సరిలేరు నీకెవ్వరు సినారె కవిరాజులు మీరు
మాలో అక్షరాలై శాశ్వతంగా బతికినారు.
- గద్వాల కిరణ్ కుమారి, 9642401878