Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి :
సరిగమలు పదనిసలు సరసమైన గమాకాలు !
రస కవితకు చతురతకు చిరస్మానియా చమత్కారి !
విరహాన్ని కళ్ళలో చూపిన విప్లవాన్ని కలంతో నేర్పరి !
కవిజ్ఞాన రచయితని జ్ఞానపీఠమే సత్కరించే !
చరణం :
రాజన్న సిరిసిల్ల జిల్లాలో హనుమాజీపేట గ్రామంలో జన్మించిన సినారే!
ఆచార్య సింగిరెడ్డి నారాయణ అసలు పేరు (సినారే)!
ఒక గొప్ప వక్తగా సాహితీ పరిశోధకుడు గా.....!
బహుభాషా వేత్త గా ప్రయోగ శీలిగా ప్రసిద్ధికెక్కిన సినారె!
చరణం
నాగార్జున సాగరం కర్పూర సినారే!
వసంతరాయల మధ్యతరగతి మందహాసం సినారే!
ద్విపదలు ప్రపంచపదులు సినిమా పాటలు ఎన్నో!
70కి పైగా కావ్యాలు రాసిన సినారె!
సాహితి గుబాళింపు లను అద్దిన రస స హృదయుడు సినారే!
చరణం
ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయ ప్రయోగములు!
అన్న వీరి ప్రామాణిక సిద్ధాంతగ్రంథం సినారె!
ఎందరికో మార్గదర్శకం సినారె!
తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతి గా పనిచేసిన సినారె!
రాజ్యసభ సభ్యులుగా ఆంధ్రసారస్వత పరిషత్ అధ్యక్షులు గా సేవలను అందించిన సినారే!
చరణం
పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన బడిన సినారే!
విశ్వంభర కావ్యాన్ని జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారం లభించే సినారే!
అందుకున్న శబ్దశక్తి అత్త యుక్తి సినారే
కలానికి గళానికి ఉన్న ప్రత్యేకత సినారె!
సరస భావన చమత్కార కుదింపు గజల్స్ నీ జీవ గుణం!
గద్య పద్య తెలుగు పాట సవ్యసాచి సినారే!
సమగ్ర సాహిత్యం తనివితీర జనులకెల్ల!
హృదంతరాళ జనిత మా సినారే!
తనివితీర విజ్ఞానసుధ లు దొరుకునో సినారే!
ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింప తరలిరమ్ము సినారె!
చరణం
విశ్వాన్ని గెలిచినోరు విజేతలు కారురా !
విశ్వాసం కలిగినోళ్ళు విజ్ఞాన గురుతులు చూ సీనారే !
వికృత క్రియల సిరియా విశాల జీవితాలు లేక
ప్రశాంత అడుగులు వే సినారే !
నరమేధం రక్తస్నానం తమ ప్రాణాలను
చీకటిలో దా సినారే !
చరణం
శాంతి వైపు అడుగులేసి స్వేచే పతాకాన్ని తెచ్చే సినారే !
తమ ఉనికికీ మరో మరణాన్ని కోరిన అమెరికా
ఆ జపానును శిదిలము చే సినారే !
ఆర్థిక గెలుపులకోసం ఆయుధ విచక్షణతో
శవాలను మొ సినారే !
జరుగుతున్న మరణ హోమాలు చూస్తూ
మానవ కలమే కదిలి విశ్వంభర రా సినారే !
చరణం
విచక్షణ కోల్పోయి విలువలు మరిచిపోయి
విలాసాల కొరకు పోయి
పిల్ల జల్లా ముసలి
ముతక గొంతుకలునూ ఉగ్రవాదీ కో సినారె !
ఆధిపత్య ధోరణులతో అమాయకపు
ఆస్తులను దో సినారే !
నియంతలా దారుణాలు హిట్లర్ స్టాలిన్ క్రియలో
శవాలుగా పో సినారే !
నరులపైనా ముర్క విజయము
సామ్రాజ్యపు కిరీట కారణమూ
బలిదానం
చేసిన కుటుంబాలు సినారే !
సర్వ సార్వభౌమ అక్షర రాజ్యం నీదేరా!
వీధి బడి విశ్వంభర అక్షర వీరు డా అశ్రు నివాళి అందుకో.... సినారె!
-నెల్లుట్ల సునీత ,7989460657
కలం పేరు శ్రీరామ