Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రజల కన్నీళ్లపు అగ్నిధార
దాశరథి
నిజాం పాలనను నిగ్గదీసిన తెలంగాణ
ధీశాలి దాశరథి...!
పద్యాలకు పదునుపెట్టి నిజాంపై ఎక్కుపెట్టి
విముక్తికి శ్రీకారం చుట్టిన మహాకవి దాశరథి
ఉద్యమ ప్రేరణ కు ఊపిరిలూది
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని
వెలుగెత్తి చాటిన ప్రాంతః స్మరణీయుడు
దాశరథి.....!
పీడిత ప్రజల గొంతుగామారి
దగాకోరు,బటాచోరు,రజాకారు అని
నినదించిన నినాదపు శబ్దపు ఊపిరి
దాశరథి....!
నిరంకుశ పాలనకు పునాదివేసి
నిజాం పాలనకు సమాధి కట్టిన
అభ్యుదయ కిరణం దాశరథి...!
ఆంధ్ర సాహిత్య ప్రతినిధి
నవ్యభావాల పదసంపద నిధి
మన దాశరథి...!
నాడు సాహితీపూదోటలొ
నువునాటిన వృక్షాలకు పూసిన
సుమాలమె మేమంతా
నీదే ఈ సాహిత్య సుమ పరిమళ
గుభాళింత....!
సినీ వినీలాకాశంలొ విహరించిన
విలక్షణ గీతాభ్యుదయరచయిత
కులమతాల మబ్బులను చీల్చుకొని
మానవ కళ్యాణం కోసం పణమెత్తిన
భాస్కరుడు దాశరథి...!
గాయపడిన కవి గుండెల లో
రాయబడని కావ్యలను రాసిన
కవి సింహం దాశరథి..!
భావప్రేరిత ప్రసంగపు చైతన్య క్రాంతి
సారస్వత పరిషత్ నిర్మాణపు స్రవంతి
ఆంధ్ర సాహిత్యపు కవితాచక్రవర్తి మన దాశరథి...,
ఇదే ఆ మహాకవికి నా అక్షర నివాళి...!!!
- ఆకుల.వెంకటరమణ
హైదరాబాదు( బడంగ్ పేట్ )
94417 17212