Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజల్ని చైతన్య దీప్తులను చేసి
రాచరిక పోకడలను వ్యతిరేకించి
నా తెలంగాణ రైతుమాగాణ -ఏలే రాజులు బూజులు అని ఎలుగెత్తి చాటిన పోరుబాట ఆయనిది
కోటిరతనాల వీణ-నా తెలంగాణ అని ఉద్యమబాట పట్టిన తెలంగాణ రవి- ఉధ్యమకవిసారధి - దాశరధి !
కళాన్ని బంధూకు చేసి
అక్షరాల్ని తూటాలు జేసి
పధ్యాల్ని ఆయుధాలుగ మార్చి
నిజాం నిరంకుశ పాలనపై
తిరుగుబాటు బావుటా ఎగురవేసి
‘ముసలి నక్కకు రాచరికంబు దక్కునే’ యని ఘీంకరించి
జైలుపాలైన విప్లవ యోధుడు దాశరధి మహాశయుడు !
తెలంగాణ వీరుల త్యాగాలను చరిత్రపుటల నింపి
అగ్నిధార రుద్రవీణ మోదుగుపూలు మహాంద్రోదయం
చిల్లరదేవుళ్ళు వంటివెన్నో దాశరధివారి పండిత ప్రావీణ్యపు మచ్చుతునకలు !
ప్రజల నాల్కలపై నిత్యం పాడుకునే ఎన్నెన్నో శృంగార విప్లవ జానపద లలిత గీతాలుగా
సినీ వినీలాకాశంలో చిరస్థాయిగా ఒదిగిపోయిన
సాహితీ రధసారధి -
మహాకవి దాశరధి !!
—————————-
-బొంతు వి వి సత్యనారాయణ ,
2-384, డాబాగార్డెన్ను,
అమలాపురం, తూర్పుగోదావరి ,
ఏపీ-533201.
చరవాణి :9912233739.
ఇ-మెయిల్:
bonthu.vvs@gmail.com