Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గజల్ కోయిల గళం విప్పి,
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనీ,
వెన్నెల రాత్రులలో,
నిన్న లేని అందాలను నిదురలేపిన శృంగార రస భావమా!
తెలుగు సాహిత్య పూదోటలో, అక్షర పరిమళాలను వెదజల్లిన కర్పూర వసంతరాయమా!
సినీ వినీలాకాశంలో ధ్రువ తారగా మెరిసి,
పద్య గద్య గజల్లతో
హృదయవీణ ను మీటి,
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అని బంధాల విలువ తెలిపి,
అందరి హృదయాలలో
సుస్థిర స్థానాన్ని నిలుపుకున్న ఆత్మ బంధమా!
నీ పంచె కట్టు సంస్కృతితో..
చిరునగవు మోముతో,
ముత్యాల మాటలతో,
తేనెలూరు పాటల ఊటలతో,
కనికట్టు చేసిన నారాయణుడా!
విశ్వంభర కవనం తో,
విజయకేతనమెగరేసి,
జ్ఞాన పీఠాన్ని అధిరోహించిన
పద్మభూషణుడా!
దివిజ కవీంద్రుల గుండియల్.. దిగ్గురనగా..
అరుగు చున్నాడు సి నా రె
అమరపురి కి..
అని ..
అంబరంలో కెగసిన విశ్వంభర మా.!
సాహితీలోక సవ్యసాచి..
గజల్స్ మాంత్రి కుడా!
సాహిత్య హృదయ సవ్వడి సినారె అని..
సాహితీలోకంలో కవి దిగ్గజంగా..
వెలుగొందిన విశ్వంభరుడా!
అందుకోండి కవితా కుసుమాంజలుల
అక్షర లక్షల నివాళులు
- తిరునగరి పద్మ
తెలుగు పండిట్
హన్మకొండ
వరంగల్ అర్బన్