Authorization
Mon Jan 19, 2015 06:51 pm
‘మదార మకరందాలు’ మాధుర్యం అందించాలన్నా
‘నవ్వని పువ్వు’ను రమ్యంగా నవ్వించాలన్నా
‘నింగికెగిరిన చెట్టు’ను
చూపించాలన్నా
‘అజంతా సుందరి’ని దర్శించాలన్నా
‘విశ్వంభర, విశ్వగీతి’ లు విశ్వవ్యాప్తం గావించాలన్నా
అదిఒక్క ‘సినారే’కే సాధ్యం !
విధ్యఅంతయూ ఉర్దూలో సాగినా
తెలుగుపై మిక్కుటమైన మక్కువ
అందుకే ఆయన తెలుగుభాషా రచనలెక్కువ
పద్య గద్య గేయ వచన నాటిక నాటక లలిత జానపద కావ్యాలెన్నో ఉదయించాయి
గజళ్ళు తెలుగు ప్రక్రియకు ఆద్యుడు ఆయనే..
అక్షరాల పొందిక,భావం, చమత్కారం అభ్యుదయ భావాలు శిల్ప సౌందర్యం కూర్పు లలో నేర్పరి
తెలుగువారి గుండెల్లో స్థిరముద్ర వేసుకున్న పరిపూర్ణ సాహితీమూర్తి - సినారె !
విశ్వవిద్యాలయ ఉపకులపతిగ,
రాజ్యసభ సభ్యునిగ రాణించిన కీర్తి మూర్తి
ఉన్నత ప్రామాణిక రచనలు ఆయన సొంతం
అందుకే అందుకున్నారు ఉత్తమ కేంద్ర జ్ఞానపీఠ అవార్డు, పద్మశ్రీ , లెక్కకుమిక్కిలి సన్మానసత్కారాలు పురస్కారాలు..
సినీ ప్రస్థానంలో ‘నన్నుదోచుకుందువటే’అని మొదలిడి వన్నెతగ్గని ముప్పది ఐదువందల సినీగీతాలు చిత్రజగత్తుకు అందించి తెలుగువారి మనస్సులు దోచుకున్న
సాహితీ శిఖరం - సినారె !!
-కవిరత్న బొంతు వివి సత్యనారాయణ ,
విశ్రాంత సహకార అధికారి,
2-384,డాబాగార్డెన్సు,
తూర్పుగోదావరి , ఏపీ-533201.
చరవాణి:9912233739.