Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాశరథి కృష్ణమాచార్యులు
చైతన్యపు సారథి
సాహిత్యపు వారథి
తెలంగాణ కై పోరు
చేసేను దాశరథి
బహుముఖ ప్రజ్ఞావంతుడు
నిత్యచైతన్య శీలుడు
ఆంద్రప్రదేశ్ కు మొదటి,
ఆస్తాన కవి అయ్యాడు.
తన మహోంద్రోదయము
అమృతాభిషేకము
అగ్నిధార,రుద్రవీణ,
తిమిరంతో సమరము.
దాశరథి కవితోద్యమము
రచనలోన అభ్యుదయము
దాశరథి లో కనిపించు,
వేష,భాషాభిమానము.
మానవత్వానికీ
రాక్షసత్వానికీ
జరిగె పోరలో ఎదురు,
నిలిచే నవాబుకీ....
✍బి. అనంత్
శేరిగూడ
రంగారెడ్డి