Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతావని రహదారులన్నీ,
రామేశ్వరం వైపు నడక సాగించాయి,
అశ్రునయనాలతో అంతిమవీడ్కోలుకు....
అతని ఆలోచనలు, ఆవిష్కృతులు, అంతరిక్షం,
అవనికి పయనమయ్యాయి....
నింగిలోని నక్షత్రాలు నేల రాలి,
చుక్కల తివాచి పరిచి,
దారిపొడవునా స్వాగతం పలికాయి...
PSLV3 పుడమికి తానొచ్చింది పుష్పకవిమానముల,
సురక్షితముగా స్వర్గలోకం వరకూ తీసుకెళ్లింది.....
అంతరిక్షం నను అనాథను చేసినాడని,
బోరున విలపించి వర్షముతో,
పార్థీవ శరీరాన్ని తడిపింది....
ఆలోచనల అగ్ని శిఖల రెక్కలు (wings of fire),,
శీతల మార్గములో శరీరానికి వేడి నిచ్చాయి...
అగ్నిక్షిపణి తాను నిప్పురవ్వై,
జ్యోతి వెలిగించి కలాములో ఐక్యమైనది...
భరతమాత తనివితీరా ముద్దాడింది,
త్రివర్ణపతాకము కలాం దేహముపై,
కప్పినందుకు మురిసిపోయింది....
-రచన.. వైద్యం భాస్కర్
(డాక్టర్ అబ్దుల్ కలాం పరమ పదించిన రోజు రాసిన కవిత )