Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింగిరెడ్డి గారినెలా వర్ణించ గలనని
జ్ఞాన పీఠానికే వన్నె తెచ్చిన వారికి వంగి
ప్రణమిల్లుటే గాని వేరేమీ తెలియదని
మరెలా వ్రాయుటనే తర్జన భర్జన తో పరిచయం
చూడ పెక్కు విషయాల వినికిడి తో రేడ్డి
గారంటే దొడ్డ మనసున్న వారని
దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు
నా ఉంటే..నే ఒరిగేను అమ్మవైపన్న
వారి మాతృ భక్తి కి మోకరిల్లుదు
బాధ్యతారా హిత్యం లేని వీరు
వేసవిని మన స్వర్ణ సినీగీతాలకంకిత పరచె
ప్రోద్బలులే లేని తానుగా చదువుకున్న
ఆయన యవ్వనాన ప్రకృతి వర్ణనపై
ఆపై మానవీయ దృక్పథం పై కలం ఝళిపించిన పద్మభూషణ
సమకాలీనులందరి స్నేహశీలి
కుటుంబం గుండెల్లో
వీరె విశ్వజనులందరి మదిలో విశ్వంభరుడె
ముఖానికి ముడతలు మనసుకు మడతలు లేవన్న
రెడ్డి గారు "చెలియా కానరావా" వినేవారు మరి
మనకేల కానరాకుండా కనుమరుగైనారో
అదేమరి చిత్రం..భళారే విచిత్రం