Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతసేపు చూస్తూ ఉండలేను
కొంతసేపైతే సరే
ఎంతసేపు చూస్తున్నా
ఎగిరి నడిచే రోజులను
రోజుల పరుగులు
సంఖ్యాతీతంగా సాగుతున్నాయి.
మనోవేగంతో పోటీపడి
ఊపిరి గాడ్పులు చెలరేగుతున్నాయి.
ఊరికే రోజులతో చేయి కలిపి
అందుకోలేక పోతున్నాను.
మనోవేగం పెరిగితే
ఆ రోజులను అందుకుంటానో?
మనసు రగులుతున్నది
వేగం పెరుగుతున్నది.
నా మనసు పరుగులు తీస్తున్నది
పరిసరాలు ప్రశంసలతో
ముంచేస్తున్నవి.
- డాక్టర్ సి.నారాయణరెడ్డి