Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇనుడు
పడమటి కొండల్లో
పడుకునేవాడు.
ముసిముసి చీకట్ల
బుసబుసలు
నిద్రలేచేవి.
మరికొంతసేపైతే చికట్లు ముదిరి
మొత్తం జగత్తుపైన
తమ కాళ్ళు మోసేవి.
మరీ మరీ కొంతసేపైతే చీకటికాళ్ళను
ఒక పక్కకు తోసేసి
అరుణ భాస్కరుడు
శిరసెత్తేవాడు.
అత్యుజ్వల కాంతులతో...
- డాక్టర్ సి.నారాయణరెడ్డి