Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజస్సు నా తపస్సంటూ కొనగోటి మీది జీవితాలపై రెక్కల సంతకాలు చేస్తూ
అద్భుతమైన దృక్పథాలతో వ్యాపించిన భూగోళమంత మనిషి మన సినారే
మట్టి మనిషికీ ఆకాశానికీ ఉన్న సంబంధాన్ని చైతన్య జలపాతాల సవ్వడినీ
విప్లవ మంటలతో ఎర్రపూవుగా పూసిన మానవుని వ్యక్తిత్వాన్ని
కలిసి నడిచే కలంతో అద్భుతంగా మలచిన విశ్వంభరుడు
వెన్నెల వాడలో విహరిస్తూ కర్పూర వసంతరాయలుడిని
కాలం సాక్షిగా సృష్టించిన విశ్వనాథ నాయకుడు మన సినారె అంతెనా
"చుక్కలతో నొక్కసారి సూచింతును
నా కన్నియ నల్లని వాల్జడ లోపల
మల్లియలై మొలవాలని"-అన్న ప్రణయకవి...
"ఏ మొగమ్మున చూపు నిల్పిన
ఇగురు వోసెడు కాంతి
ఏ సిగను పరికించి చూచినా
ఏటవాలుగా నవ్వు మల్లెలు"- అని చెప్పిన శృంగార కవి....
"ఈ రాత్రి కనవలసింది- కవలలను కాదు
క్రాంతి గోళాలను
ఈనాడు కావలసింది డోల ఊపడం కాదు
నిద్ర లేపడం జోల పాడడం కాదు-మేలు కొలపడం"-అన్న విప్లవ కవి...
అందుకే అవార్డులన్నీ ఆయన పేరు ముందు చేరి తరించాయి,
గజల్లు ఈనే చేవ్రాలు నుండి జారి పునీతమయ్యాయి
ఇంతటి వజ్రపు తున్కను సాహిత్య దివిటీని కన్న
నా తెలంగాణా తల్లి ఎంత గొప్పదో
అందుకే సినారే అందుకో నా ఆక్షర నివాళి
- వకుళ వాసు
9989198334