Authorization
Thu March 06, 2025 02:26:18 am
నీ పాట పరిమళమే
నీ మాట మధుర భాషణమే
నీ కవిత సువాసనయే
నీ గజల్స్ గాన గంధర్వమే
చిత్ర జగత్తు నేలితివే
జాన పదాలను పట్టితివే
జన నాడిని కొల్ల గొట్టితివే
మనిషి మనసున మత్తు జల్లితివే
మాటల కందని భాష్యం
మైమరిపించె నీ కంఠం
తెలుగు దనము నీ రూపం
తెలుగు భాషనే నీ కీరీటం
పల్లెన మెరిసిన మాణిక్యం
పండిత పామరులకు ఆమోదం
నీ ప్రతిభకు లేదు కొలమానం
మా కవులకు నీవొక ఆదర్శం
జనులందరి అప్యాయత
నీ సేవకు మెచ్చెను ప్రభుత
విశ్వంభర విజేత
జ్ఞాన పీఠమే నీ ఘనత
-అన్నల్ దాస్ రాములు
సిద్దిపేట
చరవాణి :9949553655