Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలాన్ని హలంగా చేసుకొని
పాఠక హృదయాలలో అక్షర సేద్యం
అలుపులేకుండా ఆగకుండా చేసి
జ్ఞానపీఠమెక్కించిన కవి సినారె
పద్యాలతో మొదలిడి
గేయాలకు, వచనానికి,
నూతన ప్రక్రియలకు
అది ఇది అని లేకుండా పండించి
పాటల జలపాతాన్ని సృష్టించిన
తెలంగాణ కవి మన సినారె
ఉపన్యాసకునిగా ప్రారంభమైన యాత్ర
ఉపకులపతి దాకా సాగించాడు
ఎందరో శిష్యులు సంపాదించి
మార్గదర్శనం చేసిన సుకవి సినారె
కొత్త కవులకు వర్తమాన కవులకు
రేపటి కవులకు పుస్తకమై నిలిచి
ఉత్తేజం ఉత్సాహాలను పంచుతూనే
ప్రయోగాలు చెయమన్న ప్రయోగ శీలి
విజయాలు పొందొచ్ఛని నిరూపించిన సినారె
అక్షరమై ప్రత్యక్ష వుతూనే వరాల జల్లు లను
కురిపించి నిత్య నూతన కవి.
-పెందోట వెంకటేశ్వర్లు
అధ్యక్షుడు
శ్రీ వాణి సాహిత్య పరిషత్
సిద్దిపేట-జి. సిద్దిపేట
9440524546