Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు దీపమై
వెలిగాడు ప్రపంచమంతా
పాట పల్లకై
మోసింది సినారే ను
కవిత్వ గుర్రాన్నెక్కి
కళ్లెం చేతపట్టి నడిపాడు
జ్ఞాన శిఖరాల చుంబించి
జ్ఞాన పీఠాన్ని అధిరోహించాడు
పంచ కట్టు తెలుగుదనంతో
తెలుగు కళ్ళను మెరిపించుడే కాక
ప్రపంచాన మొనగాడు
పంచె కట్టుటలో తెలుగువాడని
విశ్వానికి చాటాడు
పెద్దన వలె కృతి చెప్పిన
పెద్దన అన వలెనని పెద్దనను
తెనాలి రామకృష్ణుడంటే
సినారెలా పాట రాసి
జ్ఞాన సిరిన తూగాలని కెసిఆర్ అని
సినారె పాటను
తెలుగై మోసాడు
-కథల తాతయ్య
ఎన్నవెళ్ళి రాజమౌళి
విశ్రాంత ప్రధానోపాధ్యాయులు తడ్కపల్లి
మం., జి. సిద్దిపేట