Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలాన్ని గళాన్ని మేళవించి
జనానికి ప్రభుధించి కలంతో అగ్నినిజుల్పించి
అమృతవర్శినిల పన్నీరుజల్లులుజల్లారు
శ్రమశక్తికి మట్టిపరిమళాలను అద్దుతూ
మమతల పూలపరువాలు పర్షినా
బాధల బరువులను మోస్తూ
కన్నీటి పొరలను శృంగార తాంబూలమద్ది
మున్నిటి తెరలను అంగారాన్ని అల్లి
ప్రేమానురాగల పల్లకిలో సాగిపోతూ
వియోగ సారాన్ని ప్రణయనాదంలో
విప్లవాగ్నులు కవితవనంలో చినుకుచుక్కలరాల్సుతూ
సాహితీజగంలో ఎగిరిన ధ్రువతార
వినీలాకాశంలో కవిత జవరాలునువరిస్తూ
కర్పూర వసంతరాయులుతో సరసమడిస్తూ
పద్యసొబగుల అమృతాలు జిల్కి
విశ్వంభరకావ్య గీతికను విరచిస్తూ
జ్ఞానపీఠంపై యెధుడిల నిల్చినావు
మంటలు -మానవుడానంటూ
నిప్పుకనికల్లో రగులుతున్న మనిషి
మానవతా లతలు అల్లుకున్న వైనం
మట్టిమనిషి - ఆకాశమంటూ
ఎవరెష్టు శిఖరాగ్రభాగాన కీర్తిపతాకమై
నాగార్జున సాగరంలో విరహాసమీరాలు
నేలపై దుక్కిలో విత్తులుజల్లిన
మొలకమొగ్గలై విచ్చుకున్న పరువాలు
ప్రపంచపదులు ప్రాపంచికమై విలసిల్లి
జగతిమెడలో కవితమాలికలు అద్దినాడు
నిట్టూర్పుల వంతెనమీనా
నిజాయితిని చేరుకుంటూ
నిరాశ ఊడల్ని పట్టుకొని
నింగాంచుల్ని అదుముకుంటానoటూ
ఆశల పందిరిలను కర్తవ్యోపదేశాల
సంచలనాక్షరాక్షరాలై కరదీపికలువేదజల్లి
స్వచ్ఛశీలమే నీకున్న వెదజల్లే బురదనుమర్వద్దు
పుకారుకేమనిఅనుకోకు అదిపునాదులనుతొల్చేసుంది
సినిజగత్తులో తారచంద్రుడిలా
కలంగళం పాటల ఊట జలపాతంలా
సరగాలు సరోవరాలు మత్తడిలు
మనుసును ఉప్పొంగేలా జేస్తావు'సినారే'
గజల్ ప్రణయోక్తులు దాశరథీ ఒడిలోగింగిరాలుతిరుగుతూ
రుబాయిలు రుబాబ్జేస్తూ నడకలుదీసేలాజేసి
కవన సేద్యంలో అక్షరగుళికలద్దినావు'సినారే'
సాహితీ వాహినిలో 'ఆధునికాంధ్రకవిత్వం--
సంప్రదాయాలు-ప్రయోగాలు'భవిష్యనిధుల్ని
పసిడిజిన్కులు పరవశించిన వేళలో
అక్షరగమనాన్ని పూలేరుల నడయాడించి
ప్రకృతిలో ఒలలాడినోడు మన 'సినారే'
భళీరా 'సినారే ఏమి రా సినారే'యంటూ
దాశరథీ గుండె కవటంలోంచి మాటై ఉబికివచ్చి
సినారే ప్రతిభ త్రివర్ణం ఎగిరేసినోడు
--ఓర్సు రాజ్ మానస.
Cell:9849446027.