Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచం లో భాష లేనిది. బంధం ఉన్నది సృష్టిలో అతిమధురమైనవి , జీవితంలో మనిషి మరువలేనివి రెండే రెండు ఒకటి ప్రేమ, ఇంకొకటి స్నేహం. మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే పుట్టినప్పుడు అమ్మానాన్న , పెళ్లి అయ్యాక భార్య, వృధ్యప్యం లో పిల్లలు ఇలా ఒక్కొక దశలల్లో ఒక్కొకరు మనకు తోడుశీటారు కానీ స్నేహితుడు మాత్రం ఎప్పుడూ మన వెంటే ఉంటాడు . ఇలా ముఖ్యంగా బాల్య స్నేహం ఎంతో మధురమైన తీపి గుర్తులను ఇస్తది. ఇకపోతే ఇంకొకటి యవ్వనప్రాయంలో ఏర్పడే స్నేహం అంత్యంత ముఖ్యమైనది ఎందుకంటే మనిషి జీవితం లో పుస్తకాలు నేర్పే పాఠాలతో పాటు మనిషి యొక్క స్వభావాలను ఇక్కడనుండే మనం నేర్చుకుంటాం. అలాగే జీవితం లో ఎంతో మంది స్నేహితులు పరిచయం అవ్వుతారు కానీ మనతో ఎవ్వరూ ఎక్కువ కాలం మనతో ఉంటారనేది ముఖ్యం.
నా విషయం లో నేను చాలా సంతోషమైన విషయం ఏమిటంటే నా జీవితంలో ఆనందం కోసం స్వచ్ఛమైన స్నేహని పంచే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయం లో చాలా అదృష్టవతుడిని నేను. స్నేహం యొక్క గొప్ప తనాని మాటల్లో చెప్పలేను కానీ నాకు ఎదురైన ఒక సంఘటన ద్వారా మీకు తెలుపుతా.
మేము 10 మంది స్నేహితులం . కానీ మాలో చిన్న చిన్న మనస్పర్థల ద్వారా నిత్యం గొడవలు జరిగి అపుడపుడు రెండు జట్లుగా ఏర్పడుతం కానీ, మళ్లీ రాత్రి అవ్వగానే అందరం ఒక్కటిగా కలిసి ముచ్చట్లు పెట్టుకొని , షికార్లు కొడుతూ గొడవలతో ఉండేవాళ్ళం. అయితే పిల్లలకు సంతోషకరమైన పడుగలు అంటే రెండే రెండు ఒకటి సంక్రాంతి ఎందుకో మీకు బాగా తెలుసు అనుకుంటా... అలాగే ఇంకొకటి వినాయక చవితి . అయితే అప్పుడు వినాయక చవితి పండుగ నెల రోజులు ఉంది. ఇంకా మేము అప్పడినుండే చందా స్టార్ట్ చేసినం కానీ మాలో ఐక్యమత్యం లేక పోవడం వల్ల సరిగ్గా చందా వచ్చేది కాదు . అలా ఒకరోజు మాలో ఒకనికి ఫుల్ జ్వరం వొచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు,అయితే ఈ విషయం మాకు ఆలస్యంగా తెలిసింది ఏమైంది అని ఫోన్ చేస్తే వాడికి ఫుల్లు జ్వరం వొచ్చి రక్త కణాలు పగిలిపోయి కండిషన్ సీరియస్ గా ఉంది అన్నారు. అప్పటికే మా దాంట్లో గొడవ జరిగి ఎవ్వరూ సరిగ్గా మాట్లాడుకుంటలేరు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు . వీలు వాడి దగ్గరికి వస్తారో లేదో అర్థం అయితలేదు. ఇంకా అందరికీ ఫోన్ చేసి వాడికి సీరియస్ గా వుందటర అనగానే అందరూ వచ్చారు ఇక అందరం కలిసి హాస్పిటల్ కి వెళ్ళినశీ అక్కడికి అడిగితే రక్తం కావాలి కండిషన్ సీరియస్ గా ఉంది మాకు నమ్మక లేదు అంటున్నారు డాక్టర్స్ . కానీ అప్పడికే 7 బ్లడ్ ప్యాకెట్లు పెట్టారట ఇక హాస్పిటల్ లో స్టాక్ లేదు వనికేమో ఎమర్జెన్సీ ఎం చేయాలో అర్థంకాలేదు అప్పుడే మాలో ఒక్కడు వానికి ఎం కాకూడదు అని బ్లడ్ ఇవ్వడానికి పోయాడు కానీ వానికి వయ్యసు లేదు. ఇక వేరే దగ్గర నుండి కొనాలి , కొనాలి అంటే అంతగా పైసల్ లేవు వాల దగ్గర , ఇంకా మతో ఉన్న చందా పైసలు మా దగ్గర ఉన్నాయి, అలాగే మా దోస్తు గాడు ఇంట్లో అడిగి కొంత పైసలు తెచ్చి అన్ని కలిపి వాలకి ఇచ్చినం ఇక వాలు వెళ్లి రక్త తెచ్చారు వానికి పెట్టి అయితే అది కూడా వాని శరీరం లో ఉంటలేదు బయటికి వచ్చేస్తుంది. మళ్లీ ఇంకొకటి అల ఎక్కిస్తునే ఉన్నారు రక్తని అలా ఆరోజు ఈవినింగ్ వరకు అందరూ ఉండి వెళ్లిపోయారు. నేను ఆరోజు మొత్తం అక్కడే ఉండి మళ్లీ మార్నింగ్ ఇంకొకడు అల తోడుగా ఉన్నం . అలా వానికి కొంచెం తొందరగానే తక్కువయింది. ఇంకా అప్పుడు వినాయకుని పెట్టమేమో అనుకున్నాం కానీ, అప్పడిధాక మాలో గొడవలు జరిగి విడిపోయిన వాలం ఆ సంఘటన ద్వారా మళ్లీ ఏకం అయ్యం దాంతో మళ్ళీ మాకు చందా రెట్టింపు వొచ్చింది . వినాయకుడి చవితి కూడా ఘనంగా జరిగింది.
అప్పుడనిపించింది పెద్దలు చెప్పినట్లు ఐక్యమత్యమే మహా బలం అని ఎందుకంటరో అని అలాగే గొడవలు ఉన్న మాత్రాన స్నేహం విడిపోదని సమస్య వచ్చినప్పుడే దాని గొప్ప తనం తెలుస్తుంది అని, అయిన సంతోషం లో ఉన్నపుడు అందరూ ఉంటారు కానీ సమస్య వచ్చినప్పుడు ఎవ్వరూ ఉండరు కానీ సంతోషమొచ్చిన , సమస్య వొచ్చిన మనతో ఉండేవాడే కదా స్నేహితుడంటే . అలా ఆరోజు అర్థం అయింది స్నేహం యొక్క గొప్పతనం . ఇంకా మేము అప్పుడప్పుడు గొడవ పడి దూరంగా ఉన్న సంతోష సమయం లోనూ, సమస్యలు వొచ్చినప్పుడు మాత్రం అందరం ఏకమవుతం అలా రోజు ఈవినింగ్ మా బ్యాచ్ అంతా ఒక చోటుకి చేరి కుల్లు జోకులు వేసుకుంటూ, షికార్లు కొట్టుకుంటూ వారానికి ఒక సినిమా, నెలకు ఒక విహార యాత్రకు వెళ్తూ జీవితాన్ని ఇంజాయ్ చేస్తూ, జీవితంలో మర్చిపోలేని అనుభవాలను మాలో నింపుకుంటున్నం.
- ప్రసాద్ పూర్ణకంటి
7569676354