Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేరు పర్వత గంభీరము నేలువాడూ
వర్షపర్జన్య సంకాశ ప్రాభవుండతడె
పున్నమి జాబిలిని మధించి తీసిన సుధతో నీలోత్పలాన్ని
అద్దిన శరాన్ని కళ్ళతోనే సంధించగల పంచబాణుడు కూడా
పూలల్లోని మకరందాన్ని సేకరించి,
రంగరించి తన గొంతు లో చేర్చి పలికించగల కలకూజితమూ
శిలలను పుష్పింపజేయగల ఆమనీ.
విరులకు సరిగమలు నేర్పగల స్వరధునీ.
ముందర మేరు పర్వతమే అనుకున్నా
ఆతర్వాత తెలిసింది అరకులోయల్లో
కూడా అతనున్నాడని
అరకులోయల్లోనే కాదు యదలోయల
గిలిగింతల్లోనూ అతడే
కాదు తలపుల గవాక్షానికి
వలపులతోరణమూ తానే
మోడులాంటి రోజులు చిగురిస్తే అది కనికట్టు కాదు అది అతడికే తెలిసిన మానసేంద్రియసేద్యం .
కొత్తగొట్టి ప్రతిష్టించాడుగా జీవితాన్నీ
-శ్రీమతి భాగవతుల భారతి