Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతనోసంస్కారవంతుడుసుజనప్రియుడుసృజనాత్మకుడు
పీడితజనులకుఆశాజ్యోతిపడతులపాలిటపరంధాముడు
అని..ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఏవార్తలోనైనా
అతనినామసంకీర్తనాఆరాధనలేఅతనిఅభిమానజనసందోహాలే
నేనూఅతనిఆరాధకుడనయ్యాను
ముందరముందరమేరుపర్వతమేఅనుకున్నా
ఆతరువాతతెలిసిందిఅరకులోయల్లోకూడాఅతనున్నాడని
ఉన్నతుడన్నముసుగులోఅరాచకాలు సృష్టిస్తున్నాడని
పైన సంస్కార లక్షణవెలుగులులోన సంకుచితస్వభావనీడలు
రాజకీయరంగుపులుముకొనిరంగులుమార్చేఊసరవెల్లియతడు
నాలుగురూకలురాల్చి నలభైవందలకోట్లు దోచుకొనడం
తననైజం కనిపెట్టినవాన్ని కాటికి పంపించడం
నిజంతెలిసినాఏంచెయ్యలేనినాలాంటివారిచేతకానితనం
లంచాలుమరిగినఅధికారవర్గాల ఉదాసీనతా భావం
వాని నిరంకుశత్వ ధోరణికి అడ్డుకట్ట వేయలేక పోతున్నాయి
అతని ముసుగు తొలగేదెప్పుడో అతని పాపం పండేదెపుడో
కాలమే నిర్ణయిస్తుంది ఎందుకంటే దౌర్జన్యాన్ని
మోసాన్ని కాలం ఎక్కువ కాలం భరించదుకదా!
- శ్రీ పంతుల వేంకటేశ్వర రావు.