Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ పాదాల స్పర్శని చేరుతుంటే
మా అయ్య పాదాలను ముద్దాడినట్టుంది
నీ నిర్మాణం,
నారాయణుడు వర్ణించిన
ఇంద్రభవనం వంటిది
ఈ అందమైన ప్రపంచంలో విహారిస్తుంటే
అప్పుడే పుట్టిన పాపల
నా మనస్సు విరబూసింది
నీ ఒడిలో వేసిన అడుగుల కలయిక
నా మదిలో చేరిన అక్షరాల మాల
చేతిలో మొలిచిన పెన్ను
నీ ఔదార్యానికి బానిస అయినయ్
నీ నుండి దూరమయితాంటే
అమ్మ ప్రేమానురాగాల
ఆలింగనాల నుండి దూరమైనట్టుంది
చిన్న పిల్లాడిలా
నా కండ్ల నుండి
జాలువారిన ప్రతి కన్నీటి చుక్క
కోటి స్వరాల ఆర్తి
హాస్టల్లో ఎన్నో యేండ్లసంచి
గడ్డాలు, మీసాలు పెంచిన
పెద్ద అన్నల కష్టాలను
నీ భుజాలపై మోస్తివి
వాళ్ళ కష్టాల నుండి ఉవ్వెత్తున
ఎగిసిపడ్డ అగ్ని శిఖలకు
నువ్వు పోరుబాట అయితివి
వారందరి బాధలను విజయాలుగా మార్చి
వాళ్ళ కన్నీటి ప్రపంచంలోకి
భవిష్యత్ అనే వరి గింజలతో అలికి
నీ తేజస్సు నుండి ఎదజల్లే చల్లదనాన్ని
వారికి దారపోయవే..!
-తాళ్ళపల్లి శివకుమార్
9133232326.