Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చీకటి అంటే అందరికి అదురే
చీకట్లో ఉండటంమంటే
అందరికి బెదురే
చూసే చూపులకు అందనిది
అందుకే భయం..భయం
చీకటి కళ్లను కప్పి
మనసుతో చూడమంటుంది
మనసు విప్పి
హృదయం తెరిచి చూస్తే
నిజమైన నా అందం కనిపిస్తుంది
మౌనంగా ఉండడమంటే
చీకటి ఒడిలోకి పోవడమే
స్తబ్దమైన హృదయంలోకి
నిశ్శబ్ద లోకంలోకి వెళ్లిపోవడం
ఆశక్తుడనై నిన్ను
వేడుకొంటున్నా..
అందమైన నీ అంతరంగంలోకి
రావాలంటే అందరూ
భయపడతారు
నీకు హృదయముంది
కానీ అంతా చీకటి
మనసు ఉంది మరీ చీకటి
నీ ప్రేమ స్పర్శ మధురం
నీ వొడిలో ఓదిగిన వారికి తెలుసు
మనసుకు ఉల్లాసాన్ని
కలిగించే నిశ్శబ్దమని
ధ్యానంలోకి పోవడమంటే
నీ పొత్తిళ్ళలోకి పోవడమే
ఓ నిశ్శబ్ద ప్రశాంత వెలుగులోకి
మెల్లగా జారిపోవడం
ఏదైనా సాదించాలనంటే
నీసావాసం అవసరం
నీలో నూతన తేజం వెలిగించే శక్తి
విరక్తిలో అనురక్తి కలిగించే యుక్తి
వేదనలను తీర్చి వాదనలను తోసే
ఆత్మస్తైర్యాని నింపే మహాశక్తి
దాగివుందనే విషయం తెలువదు
నీ ఆకారం చూసి
అదిరి పోతున్నారు
నీ అంతరంగం చూసి
బెదిరి పోతున్నారు
నీలోని నిజమైన
సౌందర్యాలు ఉన్న సంగతి
తెలువక నీ కౌగిలిలోని
కమణీయం ఎరుగకనే..
అభాగ్యుల అనాదలను
నీ కడుపులో దాచుకొని
తన శరీర ఆకృతిని
కాపాడుకుంటారు
రగిలే వేదనలు నీలో దాచుకొని
కదుల లేని ఆ శక్తులు
నీ తలాపున కాళ్ళు ముడుచుకొని
మౌనంతో ఒదిగి ఉంటారు
ఎందరెందరో
అసహ్యించుకుంటారు
నీ రూపం కదులుతున్న నీలిమేఘాలు
అదొక కలల ఒడి
నిజమైన కళల మడి
ఎన్నెన్నో అందమైన ఆకృతుల దడి..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801