Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు మనమందరం
భ్రాంతిలో బతుకుతున్నాం
బాధలతో జీవిస్తున్నాం
పగటి కలలలోతిరుగుతూ
అదిగో పులి అంటే
ఇదిగో తోక అంటూ
మానసిక అంధకారంలో
మసలుకొంటున్నాం
ఊహ కందని ఊహల్లో
అబద్దాల ఆసరాతో
పుకార్ల షికార్లు కొడుతున్నాం
కల్లబొల్లి మాటలతో
కాలాన్ని మింగేస్తాం
మనిషికి బతుకు ఒక సత్యం
కదిలేఊహల్లో కాపురం చేస్తున్నాం
సుదీర్ఘమైన చూపున్నోళ్ళం...
సువిశాలమైన హృదయమున్నోళ్లం..
ఇరుకు మనసుతో జీవిస్తున్నాం
చురుకైన భావాలను వదిలేస్తున్నాం
నీడను చూసి దెయ్యమని
భ్రమ పడుచున్నాం
తాడును చూసి పాము అని
భయ పడుచున్నాం
అంతా భ్రాంతిలో బతుకుచున్నాం
మనసుకు తెలుసు మనలోపం
గుండెకు తెలుసు మన పాపం
విషయం తెలుసుకోవాలంటే
వస్తువు వెంబటి పరుగెత్తాలి
విజయం వరించాలంటే
వినయంతో విషయం చుట్టూ తిరగాలి
విశ్వాసం కోల్పోయి
నిస్సారమైన జీవితంలోకి
వెళ్లిపోతాం
తోసుకువచ్ఛే భ్రమలు
అలలా కొట్టుకు పోతాయి
నిగూఢ నిజరహస్యం
తెలుసుకుంటే
గుండెలోని వత్తిళ్ళు
దూరమవుతాయి
మనసులోతుల్లో సుడులుగా
తిరుగుతున్న భ్రాంతిని వదిలి
బయటికి వస్తే కలల కాంతులు
కళ్ళకు కనిపిస్తాయి..
నిర్మలమైన నిజ జీవితం
మర్మంలేని మానవత్వ ధర్మం
మిన్నులో వెలిగే చందమామలా
స్వచ్చంగా ఉన్నట్లు కనిపిస్తాయి
మనసంతా తేలికవుతుంది
పరివేదన పరితపన
దూరమవుతాయి
అడుగడుగున తడబాట్లు
ఎడబాట్లు ఉండవు
భ్రాంతి ఒక మత్తు
చిత్తు చేస్తుంది
ఎక్కువైతే ఎక్కడ విసిరి
వేయబడుతామో.. తెలువదు
అందుకే అన్నీ వదలాలి
అందరిలా జీవించాలి..!!
అంబటి నారాయణ
నిర్మల్
ఫోన్ నెం: 9849326801