Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎందుకు..మనమందరం
కాలాన్ని తిట్టుకుంటాం..ప్రతిక్షణం.. ఏదో ...
కోపాగ్నిని.. కురిపిస్తాం
భయపడి తిడుతామో..భయపెట్టడానికి
తిడుతామో తెలువదు..
కాలం చేసిన నిర్వాకం ఏముంది
నిజం అబద్ధం కాలంలోనే ఉంది
ఈ రెండింటికి కాలమే తీర్పు
జగతికి జాగృతి.. కాలమే
జనానికి జీవనాకృతి కాలమే
అస్తిత్వాన్ని నిలబెట్టి
వ్యక్తిత్వాన్ని విస్తరించేది కాలమే
మానవ లోకాన్ని వెలిగించి
చీకట్లను తొలిగించేది కాలమే..
అన్నీటికి మూలమైన కాలాన్ని
తిట్టడమెందుకు!!??
కాలం.. కలిసిరాలేదని తిడతాం..
మన అశ్రద్దతో ఏమైనా.. జరిగితే
కాలం.. మీదనే దుమ్మెత్తి పోస్తాం
మన పద్ధతి బాగలేకున్నా.. కాలమే...!!
అనుకున్నది జరుగకున్నా కాలమే..!!
మనం చేసే తప్పులన్నింటికీ కాలమే!!
ఎన్నెన్నో విషయాలు
తెలిసొచ్చేదీ కాలం ద్వారానే...!!
అలసత్వాన్ని పోగొట్టి
విశ్వాసాన్ని నింపేది కాలమే..
కాలాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే..
కాలంలో కలిసిపోక తప్పదు..
దాహార్తులను దగ్గరికి తీసుకునేది కాలమే..!!
దగ్గరుండి దారి చూపించేది కాలమే..!!
నిజానికి ఈ జగాన్ని ఏలేది కాలమే..!!
మనిషి ఎదిగి పోవడానికి కాలమే...!!
ఒదిగి ఉండడానికి కాలమే!!
కాలమే అన్నీటికి మూలాధారం...
అన్నీమరిచిపోయి కాలాన్ని తిట్టుకుంటాం...
గుండెను తడుతుంటాం..
మనిషి నైజం ఆ లాంటిది..
అంతానేనే..అంతానాదే అనడం అహంకారం
ఓ విలక్షణమైన కాలమే
అందరిని పునీతులను చేస్తుంది
పుడమి పుట్టినప్పడే.. పుట్టిన చరిత్రను
తనపొత్తిళ్ళలోదాచుకున్న కాలమెంత గొప్పదో..
ఒక్కసారి ఆలోచించండి..!!
నిశ్శబ్దంగాఉంటుంది.. విస్ఫోటనమై లేస్తుంది..
కాలం ఎప్పుడు మంచిదే
మన నడకను.. నడతను బట్టి
మనలోనే మార్పు వస్తుంది.
కానీ కాలం వలన కాదు..
పరిపక్వత మనలోనే ఉంది..
కాలం ఎప్పుడు మన అందరికి
అనుకూలంగానే ఉంటుంది..
మనచుట్టు కంచెలా ఉంటూ చెడును
ఖండించటానికే కరవాలమై నిలిచి ఉంది..!!
-అంబటి నారాయణ
నిర్మల్
9849326801