Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ.. కవులారా..కవిత్వమై జీవించారు
ఎందరివో నిజమైన జీవితాలను
వ్యక్తికరించినారు అందరి గుండెలో నిలిచారు
వ్యవస్థలోని అవస్థలను కళ్ళకు
కట్టినట్లుగా లిఖించిన్నోళ్లు
మీరు రాసిన కావ్యాలు గగన వీధిలో
నక్షత్రాల కాంతిల మిళమిళ మెరుస్తుంటాయి...
ఎక్కడ.. దాచి పెట్టిన నివురు కప్పిన నిప్పులే
అయినా.. చల్లని కాంతులతో
కొత్త భావాలు వెదజల్లుతుంటాయి
తెలుగుతల్లి..నుదిటిపై
సాహిత్యపు..తిలకం దిద్దనోళ్లు
ఇప్పటికి..ఎప్పటికి చదరిపోనిది
మధురమైన భావాలను పలికించినోళ్లు
ఎన్నెన్నో.. కావ్యాలతో అలంకరించి
కమ్మని.. భావాలను అందరికి పంచి
మీ దారిన మీరు వెళ్లి పోయారు
తెలుగుతల్లి గుండెలు బాదుకొని
బోరున విలపిస్తుంది
ఓ..కళామతల్లి కన్నీటి వేదన
ఓ..సాహిత్యం తల్లి .అరణ్య రోదన
మెదడును మలిచి గుండెను విప్పి
నరాలను స్వవరాలుగా చేసిన
గొప్పగొప్ప..కవులు..ఎందరెందరో
ఎన్నెన్నో... గ్రంథాలు రచియించారు
నిశ్శబ్దాన్ని ఛేదించి విశుద్ధమైన
భావాలను పాలికించినోళ్లు
మానవతాసిరులు పండించి
సమానత్వపు వేలుగులు పంచినోళ్లు
ఓ..కావులారా మీరెక్కడున్నారు..??
నేను..ఇప్పుడిప్పుడే ..అక్షరాలను
నేర్చుకొని.. అక్షరాలకు పదునుపెట్టి
మధురంగా భావాలను అల్లుకొని
చిన్న చిన్న కవితలుగా ..రాస్తున్నా
ఇవి మీకు చూపించాలని
నా ..నోట మీముందు.. వినిపించాలని
మీ..నోట వచ్చే ఆశీర్వాద అక్షంతలు
నా.. తలపై చల్లుకోవాలని నా.. ఆకాక్ష
తాత్విక తత్వాలు ఆధ్యాత్మిక సూక్తులు
ఒడుపుతో.. వలపు రగిలించే భావాలు
అభ్యుదయ నడకలు.. ఉద్యమ గీతాలు
చైతన్య దరువులు.. జీవన విధానాలు
కళాత్మక అడుగులు మానవీయ విలువలు
ఎన్నెన్నో రచియించి కాలంలో కలిశారు
గతాన్ని తలుసుకున్నప్పుడల్లా
మీ హితం.. ఓ పరిఢవిల్లిన ప్రగతి పథం
తమ అస్తిత్వాన్ని.. అందనంత
ఎత్తులో నిలుపుకున్నారు
వ్యక్తిత్వం.. విశ్వమంతా చుట్టేసింది
ఇప్పుడు కాలమంతా కవిత్వమే
అందుకే కవులు
ఎక్కడున్న.. ఓ.. దృవతారలే
గగన ..మెక్కిన వెలుగు..తారలే..!!
-అంబటి నారాయణ
నిర్మల్
9849326801