Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-- పోలయ్య కవి కూకట్లపల్లి - 9110784502
సక్రమమైన ప్రవర్తనలేని
అక్రమ సంబందాలన్నీ
ఎంతటి వికృతమైనవో
ఊహకతీతం,అమానుషం
కొందరు విచిత్రంగా
పెళ్ళైన తర్వాత
పిల్లల్ని కన్నతర్వాత
భర్తలే ప్రత్యక్ష దైవాలంటారు
నిత్యంపూజలు చేస్తుంటారు
కాని,మాయమాటలతో
మత్తెక్కించే మాయగాళ్ళను
కమ్మని కబుర్లు చెప్పి
కవ్వించే కసాయివాళ్ళను
కాల్చిన సిగరెట్టును కాలికిందేసి
నలిపేసే నయవంచకులను
ఏరుదాటి తెప్పతగలేసే
వాడుకొని వదిలేసే
కళ్ళు పొరలు కమ్మిన
కామాంధులనే నమ్ముతారు
చచ్చేంతగా, ప్రాణాలిచ్చేంతగా.
ఆపై కన్నవారి కట్టుకున్నవారి
కళ్ళుగప్పి ప్రేమికుల చుట్టే
బరితెగించి తిరుగుతారు
వారిమాయలో, మత్తులోపడి
చేతుల్లో కీలుబొమ్మలై
ఆడించినట్లు ఆడతారు
అడిగినవన్నీ ఇచ్చేస్తారు
ఆకలి తీరిన తర్వాత
ఎంగిలి ఇస్తరాకల్లే వీధిలో
విసిరే స్తే, చేసేదిలేక
ఎవరికీ చెప్పుకోలేక
అవమానాలను భరించలేక
పాపం పుట్టిన పిల్లల
బంగారు భవిష్యత్తు
బుగ్గి పాలవుతుందని, కానీ
ఆధారపడిన వారందరూ
అనాధలౌతారని,కానీ
రెండు కుటుంబాల
పరువువంతా గంగలో
కలిసింది పోతుందని, కానీ
ఒక్కక్షణమైనా,ఆలోచించక
దిక్కుతోచక, క్షణికావేశంలో
ఏ ఫ్యానుకో ఉరివేసుకొని
ఏ బిల్డింగ్ పైనుండో దూకి
ఆత్మహత్య చేసుకుంటారు
ప్రాణాలు తీసుకుంటారు
అభం శుభం ఎరుగని
అన్యం పుణ్యం తెలియని
అమాయకపు 'అమ్మలు' కొందరు.
ఐనా,చచ్చిసాధించే దేముంది ?
కన్నవారికి గుండెకోత తప్ప
చావు సమస్యకు పరిష్కారమే కాదు
బంగారమంటి బ్రతుకు బలైపోవడం తప్ప.
-- పోలయ్య కవి కూకట్లపల్లి - 9110784502