Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1.తల్లిపాల తోడ తళుకులీనిన తెల్గు
పసిపాప నవ్వుల పాల నురుగు
విరిసిన జాబిల్లి వెండివెన్నెల తెల్గు
హేమంతమున రాలు హిమజలమ్ము
అలలతో నలరారి పారేటి నాతెల్గు
సెలయేటి గలగలా కులుకులొలుకు
చిలుకమ్మ పలుకులో చిగురించు నాతెల్గు
కోయిల గొంతులో కొలువుదీరె
మంచితేనెకన్న మధురమైనదితెల్గు
ఇక్షురసముకన్న జిహ్వకింపు
పనస దొనల కన్న పస్సందయినతెల్గు
తెలుగుభాష కన్న తీపి యెద్ది!
2.తెలుగుభాషకన్న తీయనై నదిలేదు
తెలుగు పలుకు కన్న తేట లేదు
సొంత భాష కున్న సొగసై న దేలేదు
తెలిసి పలుక వలెను తెలుగు జనులు
3.ఎల్లలో కమునకు తెల్గుఘ నతదెల్ప
కొలువుదీ రెనుగదా తెలుగు సభలు
మరచి మరుగువడ్డ ఆచార సంస్కృతుల్
కాంతులీ నెడుదివ్య కాల మొచ్చె
ఈసడిం చినమన భాషయా సలునేడు
దీప్తినొం దిమిగుల తేజరిల్లె
బీడుబా రిననేల చిగురించి నట్లుగా
తనువుపు లకరించి తాండ వించ
విశ్వ జనుల కంత విధితమ య్యే లాగ
భాష సభలు జరిపె భాగ్య నగరి
విమల రూపు వాణి వినువీధి విహరింప
తెలుగు జనులు కదిలె తేజ మలర
4.ఆరామ త్రయముతో అలరారె నీనేల
మూడులిం గములతో మురియి నేల
కాకతీయులునాడు కారుణ్య బావాల
పెరిమతో నేలిన గరిమ నేల
వీరప్ర తపరుద్ర ధీరత్వమునుజూచి
పులకించినట్టిదీ పుణ్య భూమి
రాణిరుద్రమదేవి రణభూమిలొ మెరసి
కత్తిది ప్పినదినా కదన భూమి
కవుల పోషణమున ఘనకీర్తు లం దిన
ఓరుగల్లు లోని తోరణాలు
నాటివై భవమిల నేటికి నిలిచేల
చిర యశమ్ము నొసగె శిల్పకళలు
4. చల్ల గాలి లోన పిల్ల తెమ్మెర లోన
జోల పాట లోన ఈల లోన
వాగు పరుగు లోన వాహినీ పరవళ్ల
మధుర మైన భాష మన తెలుగు
5.ఆదికవి కలమ్ము నవతరిం చిజగాన
ఆదికా వ్యపునాది నాదు తెలుగు
కవిత్రయ ఘనులతో కలిసిన డ్చుటెగాదు
అపరకా వ్యపుసృష్టి నాదు తెలుగు
శతకసా హిత్యాది సత్గ్రంథ ములదీర్చి
అమరమై విరజిల్లు నాదుభాష
వర్ణనా సహితమౌ వరప్రబంధముగూర్చి
అవనిని ల్చివరలు నాదు భాష
వన్నె వాసి చెడక వర్ధిల్లుటే గాదు
అన్ని హంగు లమరి మిన్ను కెగసి
ఆధుని కపువాస
నందిపుచ్చుకొనుచు
అతిపు రాత నమయి అవని వెలిగె
6. మందార మకరంద మాధుర్యములతోడ
మధురస మొలకించు మాతృభాష
నిర్మల మందాకి నీవీచి కలదూగు
హాయిగొ ల్పెడునట్టి మధుర భాష
లలితరసాల పల్లవ లాలిత్య విలసిత
నవనీత కోమలి నాదు భాష
పూర్ణేందు చంద్రికా స్పురిత యైసాగు
జ్ఞానసు ధలుబంచు జనుల భాష
పలుతె రగుల దెలివి ప్రపుల్ల మొందేల
పదస మూహ మున్న పసిడిభాష
మనసులోని భావ మాధుర్య ములతోడ
జనుల రంజ కమయి జగతి వెలుగు
-పచ్చిమట్ల రాజశేఖర్
9676666353