Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అచ్చ చిచ్చుర పిడుగు గిడుగు వెంకట రామమూర్తి
వచన భాష సంస్కరణోద్యమకారులు
వ్యవహారిక భాషోద్యమ మూల పురుషుడు
తెలుగు భాషకు సొగసును వీలును తేలియచేసిన మహనీయులు
బహుబాషావేత్త ,చరిత్ర కారులు
సంఘసంస్కర్తగ వెలుగొందిన్నారు
హేతువాద భావాలతో శిష్టజన
వ్యవహారిక భాషను గ్రంథ రచనకు కృషిసల్పినవారు
తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహా
రంలోకి తెచ్చిన మహనీయుడు
వ్యవహారిక ఉద్యమం అందరికి ఉపయుక్త పరిచి
అయ్యాడు గ్రాంథికము నెత్తిన పిడుగు
వ్యావహారిక భాషోద్యమ స్థాపన ఘనుడు గిడుగు
తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు
కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు
పండితులకే పరిమితమైనసాహిత్య
సృష్టి సృజనాత్మక శక్తి ప్రతి ఒక్కరికీ వీలైనది
తెలుగు సరస్వతి నోముల పంట రామూర్తిగారు
నేడు అది ఆంగ్ల పర భాష మోజులో పడిపోయి మృత భాషగుతున్నది
తెలుగు అడుగు జాడలను కాపాడు
కోవడం తెలుగు వారందరి బాధ్యత
- వేమూరి కమలాకర్ సుజాత
రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా. 8801197747
(నేడు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం )