Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదిగో !!
అతడే బిచ్చగాడు...!!
ఆ..నడకలో
తడబాటు..
ఆ..చూపులో
బెరుకుతనం..
పెరిగిన గడ్డం..
మాసినగుడ్డలు..
తలమాసిన జుట్టు..
జడలు జడలుగా
కట్టేసింది..
వొంగిన వీపు..
కుంగిననడుము..
శరీరమంతా కప్పుకున్న
ఎముకల గూడు..
చీకట్లదుప్పట్లు
చుట్టుకొని...
ఇక్కట్లపరుపు మీద
ఆకలి అరుపులతో..
కాయలు కాసినకళ్ళతో..
కునుకుతీస్తూ ఉన్నాడు!!..
అతడే..బిచ్చగాడు!!..
ఏదిక్కూ తెలియదు కాని..
అన్నిదిక్కులు అతనివే!!..
డొక్కనింపే దిక్కే
నిజమైనదిక్కని గట్టిగా
భావిస్తాడు..
కడుపు..
చల్లబర్చుకోవడానికి..
రెండుముద్దలు
దొరికేదారి కొరకు
వెతుకుతుంటాడు..
శరీరంతో..
అలసినమనసును
బతుకుబరువును
మోస్తుంటాడు..
ఏ తల్లి కన్నబిడ్డో!!..
గుట్టుగా నడిరోడ్డుమీద
వదిలేసిపోయారు..
చేసిన తప్పేంటో కానీ.. తనుశిక్షను
అనుభవిస్తున్నాడు..
ఇంత పెద్దబలగం ఉండి
ఒక్కరూ..
దగ్గరికి తీయరు..
ఆ చిరునవ్వు ఏంటో!!?..
ఎవరికీ అర్థంకాని
ఆ చూపేంటో!!?..
కళ్ళలోకారే
ఆ కన్నీటికి
అర్థమేంటో..!!??
ఉన్మాదంతోనో..
ఉద్వేగంతోనో..
ఎవరికీ అర్థంకాని
బిచ్చగాడు...
ఆ వికృతరూపంలో
భయంకరంగా...
మరోరూపంలో
దీనంగా..హీనంగా
అందరి కళ్లకు నిత్యం
కనిపిస్తుంటాడు..
తప్పుచేసిన దోషిలా
నిలబడిఉంటాడు..
అర్ధనగ్న గుడ్డలతో
అందవిహీనంగా ఉంటాడు..
కొందరు చూసి..
నవ్వుకుంటారు
కొందరు కుళ్లుజోకులు
వేసుకుంటారు..
కాలం..
నమిలేసిన..
మానవలోకం..
తరిమేసిన..
అందరికీ దూరమైన
ఆ అనాధనే..
ఈరోడ్డుమీది
బిచ్చగాడు..!!
-అంబటి నారాయణ
నిర్మల్
9849326801
29-8-2020