Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ మనుగడకు మాతృభాష
మమతానురాగాల మధుర భాష
మల్లెకన్న స్వచ్ఛమైన సుగంధాల భాష!
ఉద్యమాల ఊపిరై సాగిన భాష!
సెలయేటి అలలా పారేటి భాష
జీవనది లా మనకు జీవమై పోసింది
సప్తస్వరాలు పలికించే శ్రావ్యమైన తెలుగు !
అలంకారాలతో అందంగా వెలిగే
గ్రాంధిక మైన వ్యవహారిక మైన
పలుకుబడుల భాష ప్రావీణ్య భాష
మనసులో భావాలు పలికించే భాష
యాదృచ్చికంగా వచ్చేను భాష
తేనియల భాష నా పాల భాష
పదబంధాల కు ప్రాణమై నిలిచింది
ఎద నుంచి ఎగిసేటి నా మాతృభాష
సప్తవర్ణాల ను తలపించే భాష
భాష ప్రేమికులుగా భువిలోన నిలిచి
అమ్మ భాషను మనము కాపాడుకుందాం
ముందు తరాలకు భాష ఉనికిని చాటుదాం!
- నెల్లుట్ల సునీత (కలం పేరు శ్రీ రామ)
ఖమ్మం, 7989460657