Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ.. బాటసారి
నీ బ్రతుకొక అంతంలేని
రహదారి...
తెగింపుతో
నడుస్తున్నావు..
ముగింపులేకుండా
ఉందుకు సాగుచున్నావు..
లోలోపల
ముడి వేసుకుంటూ..
ఆ ముడినే విప్పుకుంటూ
అడుగులువేస్తున్నావు..
ఇది కడలిని పోలిన
మానవలోకం..
ఎన్నెన్నో..
ఆటుపోటుల అలలు
వస్తుంటాయి..
పీడకలలై..
పీడిస్తుంటాయి...
ఎక్కడా పడిపోకుండా
అడుగులో
తడబాటు లేకుండా
అనుకున్న గమ్యం చేరుకో!!..
తొందర పాటుతో
త్రోవ తప్పకు..
అన్నీ గమనిస్తూ
అడుగులు వేయడం
మరువకు..
ఎక్కడినుంచి
ఏ శబ్ధం జనిస్తుందో
గమనిస్తూ
గ్రహిస్తూ.. సాగిపో!!..
నీ వెంట ఎవరున్నారని
ఒంటరివి...
ఈ కల్లోల కలియుగంలో
కలతలను పుట్టించే
కర్కశులు...
అడ్డుతగిలే
ఆగంతకులుంటారు...
గుండెనిండా..
విశ్వాసంతో..
లోకసంచారివై సాగిపో!!..
అనంత అన్వేషకుడవై
గడ్డకట్టిన నిశ్శబ్దాన్ని చీల్చి
బంధించిన మానవత్వానికి
విముక్తిని కలిగించు!!...
అప్పుడప్పుడు
స్వార్థపు నక్కల
అరుపులు(ఊళలు)వినబడుతాయి..
విశ్వాసం లేని
కుక్కలు ఎగబడుతాయి..
ఓ మౌనిలా..
ముందుకు సాగిపో!!...
నీ ఎడతెగని నడకలో
ప్రతి నిత్యం ఆపదలో
అడుగు పెడుతూ..
రెక్కలు విచ్చుకొనే ..విశాల విశ్వంలోకి
వెళ్ళుచున్నావు...
ఎగుడు దిగుడు కాడ
ఎదురు దెబ్బ తగులుతుంది..
ఒడుపు చూసి నడవాలి..
ఉక్కు సంకల్పమే..
నిక్కమైన..
నిలువెత్తు ధైర్యమై..
భయానికి సంకెళ్లు వేసి
బ్రతుకుదారి చూపుతుంది!!..
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
30-8-2020