Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందమైన కృతిని
కౌగిలించుకున్నా
అందమైన ఆకారం నా సొంతం
కమ్మనైన భావం నాకిష్టం
ప్రేమతో పెనవేసుకుంటుంది
ప్రాణమై నిలిచి పోతుంది
ఇదే నిజమైన కౌగిలి
అక్షరాల దొంతరలో
పేల్చిన భావాల పరిమళం
అందరిలో స్నేహంగా నిలిచింది
ఆత్మీయంగా అల్లుకుంటుంది
పదాల్లో ఎప్పుడూ చైతన్యమే..
స్వార్థం లేని అక్షరాలు
స్వరాలుగా మధుర భావమై
పలుకుచున్నాయి
ఇది లోక సంచారి
ఎప్పటికప్పుడు కొత్తరూపమే
ఓ విప్లవాత్మక ధోరణి
విస్తార.. విలాసమే
విషయాల సారమే
అందుకే అందరిని
కౌగిలించుకుంటుంది
చెరిగిపోని జ్ఞానం
అందరితో చెలిమి చేసే విజ్ఞానం
ఉద్వేగం దీని నడక
ఉద్రేకం దీని నడత
శరీరంతో పెనవేసుకొని
ఆత్మలో లీనమై
ప్రాణమై నిలుస్తుంది
ఎప్పుడూ.. ఓ.. కొత్త
ఆత్మీయ పిలుపు
కొత్త అనుబంధాల మలుపు
మానవీయత అడుగులు
ఆత్మవిశ్వాసాన్ని నింపి
అంతా చైతన్యంతో
కౌగిలించు కుంటుంది
మనసుకు
కొత్త ఊపిరిపోసే నేర్పరి
శరీరానికి మరికొత్త ఊపు నిచ్ఛే కూర్పరి
మనో వైనంతో మాట్లాడుతుంది
సంకుచితాలులేని సవ్య సాక్షి
ఇదో.. ప్రేమ రసవాహిని
ఇదో నిత్యం వెలిగే జ్యోతి
అఖండ ఖ్యాతికి వెలుగు
అంతరంగాన్ని
ఆత్మీయంగా స్పర్శిస్తుంది
ఉరకలు వేసే ఉల్లాసాని నింపి
పరుగులు తీసే ప్రావీణ్యా నిచ్చి
హృదయాన్ని తట్టి లేపుతుంది
కృతి గొప్ప దార్శనికురాలు
అందమైన హాసిని సుహాసిని
నేను.. కృతిని..అంతటా
వ్యాపించిన ప్రకృతిని
మానవలోకానికి జాగృతిని
అందరిలో విధేయతనై ఉంటాను..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
31-8-2020