Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన అందరిదీ
ప్రేమలోకంగా
ప్రకటించుకుందాం..
మనదైన కొత్తలోకం
సృష్టించుకుందాం..
వసుధైక లోకంగా
నిర్మించుకుందాం..
అందరం ఒక్కటిగా
కలసివుందాం..
అసమానత
అడ్డుగోడల్ని కూల్చేద్దాం
మంచితనపు మొక్కలను
పెంచుదాం మానవతా
కుసుమాలను పూయిద్దాం..
తరతరాలనుండి
కమ్ముకున్న చీకట్లను
తొలిగించుకుందాం...
కులాల కంచెను
శాశ్వతంగా కూల్చేద్దాం
మతాల మంచెను మార్చేద్దాం
అందరి పాదాలు
ఈ నేలతల్లి పైనే
అందరం ఈ ప్రకృతి
ఒడిలోనే ఉన్నాం
కుళ్లు లోకాన్ని వదిలేద్దాం
సంకుచిత భావాలు విడిచేద్దాం
అస్పృశ్యత..అసమానత
అనే భేదమే వద్దు....
విరోధాల వంచనాలు రద్దు...
మరో కొత్త లోకమే ముద్దు...
మనం అడుగులు
వేయడమే ఇక ముందు..
మనుష్యులుగా పుట్టినందుకు
మంచిపనులను చేద్దాం..
మానవీయతకు ఊపిరి పోద్దాం..
ఒకరికి ఒకరు తోడుగా
హితులుగా..స్నేహితులుగా ఉందాం
దుర్భర జీవితాలను వదిలేద్దాం..
విశాల లోకం నిర్మించుకుందాం..
ఆత్మీయతకు అనురాగానికి
పుట్టినిల్లుగా పురుడు పోద్దాం..
మన మధ్య ఉన్న
అగాధ మంతా పూడ్చేద్దాం...
సొంత మనుషులమై నిలుద్దాం..
మన లోపాలను సరిచేసుకొని
మనలోని వ్యసనాలను వదులుకుందాం..
మనం..ఓ నూతన
రహదారిని నిర్మించుకుందాం...
ఆ దారంతా..పలకరింపులతో
పులకరించి పోవాలి..
సమస్త ప్రపంచం గర్వించాలి..
మనకు మనమే
దార్శనికులం కాగలగాలి...
మనకు మనమే
మార్గదర్శకులమై..
సరికొత్త లోకం నిర్మించాలి ..!!
అంబటి నారాయణ
9849326801
1-9-2020