Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యుగయుగాలనుంచి
మనం
ఓడిపోతూనే ఉన్నాం..
తరతరాలనుంచి
దగాపడిపోతూనే ఉన్నాం..
మనం చేసిన
తప్పులేంటో
తెలిసిరావడం లేదు...
ఏదో బలమైన కారణం
అడ్డు పడుతుంది..
దురదృష్టం ఏదో వెంటాడుతోంది..
ఒక్కసారి మన మనస్సాక్షిని
అడిగి తెలుసుకుందాం..
మన ఒంట్లో ఏదో చొరబడ్డది..
అదే దిగజార్చుతుంది..
తెలియని వ్యసనాలకు
దారి చూపుతుంది..
స్వార్థాన్ని అంటకట్టింది..
కుళ్లు కుతంత్రాల్ని
ఒంట్లోకి తెప్పిచ్చింది..
అందుకే మనకు తెలియకుండానే
తప్పులు చేస్తున్నాం..
అన్నిరంగాల్లోనూ ఓడిపోతున్నాం..
అన్నీటికీ బానిసైనాం..
ఎందరినో బాధ పెడుతున్నాం..
సహనం కోల్పోయి
సాహసంతో అడుగేస్తున్నాం..
క్షణంలోన ప్రళయాన్ని
సృష్టించుకుంటున్నాం..
ఆవేశంతో ఆలోచనలను మరిచి
ఉన్న కర్తవ్యం మరిచి పోతున్నాం..
అందుకే ఉద్యమం
మన మీద మనమే ప్రకటించుకోవాలి..
యావత్తు మానవులందరూ
మానవీయతతో మేల్కోవాలి..
అందుకే అన్నీట్లో
ఓడిపోతున్నాం..
కృంగిపోతున్నాం..
ఎక్కడో ఓ పక్కకి ఒరిగిపోతాం..
ఎక్కడో ఒకదగ్గర కూలిపోతాం..
మనలో అన్నీ మింగేసే లోతుంది..
తెలియని లొసగులెన్నోనిండి ఉన్నాయి..
ఇంతకీ తప్పెక్కడుందో
తెలుసుకోవాలి..
ఎక్కడో మనం అనుకున్న
ఆశయాలు విరిగి పడతాయి..
అందుకే మనలోని వ్యర్థాలను
తొలిగించుకొని కర్తవ్యంతో నిలబడుద్దాం..
మనలోని స్థబ్ధతను
నిశ్శబ్దాన్ని నిర్మూలించి..
మన నడకే
ముందు భవిష్యతుకు మార్గం కావాలి...
దూకుడుతోనే అందరికీ
దూరమవుతున్నాం..
మనలో కొత్తమలుపు తిరగాలి..
కొత్త పోకడలకు ఊపిరి పోయాలి..
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
2-9-2020