Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతడు కోటీశ్వరుడు
కోట్లకు అధిపతి..
కానీ..
తొందరగానే పోయాడు..
కోట్లన్నీ వదిలేసి..
ఎన్నో ఆస్తులను..
అంతస్తులను విడిచిపెట్టి..
ఎంతో ఖరీదు చేసే
భవనాలను సైతం విడిచి..
మరెన్నో విలువైనవన్నీ వదిలేసి
వెళ్ళిపోయాడు...
ఇది సామాన్యుడి చావు కాదు కాదుగా!!..
కోటీశ్వరుడి చావు..
బాగా ఖరీదైన స్మశానానికి
తీసుకెళ్ళాలి కాబోలు..!!
కోటీశ్వరుణ్ణి
కన్నీళ్లతో సాగనంపితే ఎలా!!??..
అందుకే ఒక్కరూ ఏడవలేదు..
ఒక్క కన్నీటిచుక్కనూ
కార్చలేదెవ్వరూ...
ఎందుకో మరి!!??...
చావుకు భేదాలుండవు..
స్మశానంలో తేడాలుండవు..
కోటీశ్వరుడైనా..
కూటికి లేనోడైనా..
పోవలసింది స్మశానానికే!!..
కట్టెల్లోనైనా కాలాల్సిందే..
మట్టిలోనైనా కలవాల్సిందే!!..
గాలిలో గాలియై నిలవాల్సిందే!!..
శూన్యంలోకి ఆత్మ పోవలసిందే!!..
కానీ
ఇక్కడే.. ఎక్కడో..
చుట్టూ
ఆత్మ తిరుగుతోంది..
ఇంకా ఆశ చావలేదు కాబోలు!!..
చూసేవారి కళ్ళలో
కన్నీళ్లు పొంగాయంటే
అతనిలో కొంతైనా మంచితనమున్నట్లే!!...
ఆత్మీయతను
అంతం చేసి..
మమకారాన్ని
మట్టిలో కలిపి..
మానవత్వాని
మట్టుపెట్టి...
మోసంతో..
పేదోళ్ల రక్తమాంసాలతో
సంపాదించిన..
డబ్బు కాబోలు!!..
అందుకే ఏ జబ్బుతోనో
తొందరగా వెళ్లిపోయాడు..
అస్తిత్వం పోయి..
వ్యక్తిత్వం కోల్పోయి..
ఎంత సంపాదిస్తే ఏమి లాభం!!??
సమాజంలో..
వెక్కిరింతలు..
ఈసడింపులు..
చివరికి
అందరూ దూరమై..
నా అన్నవారు లేకుండా..
ఆ నలుగురూ రాకుండా..
ఏ డబ్బు మాత్రం
ఏం చేస్తుంది..!!??
డబ్బు...
జబ్బు రాకుండా
చేస్తుందా!!??
ఎన్నికట్టలు అడ్డుపెడితే..
చావుకు అడ్డుకట్టగా
నిలబడగలవు!!??
చావు రాకుండా చూస్తోందా!!??
అంతా డబ్బు మాయ..!!
చివరికి ఏమి మిగిలింది..బూడిద..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801