Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పడు పరుల మేలుకోరే
ప్రకృతిని పాడు చేస్తున్నాం
విత్తు నాటలేదు
గుక్కెడు నీరు పోయలేదు
నిండైన ప్రేమను పంచలేదు
చుట్టూ కంచె కట్టలేదు
కాపలా కాయలేదు
అయినా అందనంత
ఎత్తుకు ఎదిగింది
రక్షించిన వారిని భక్షించినట్లు
ప్రకృతి మీద
అధికారం లేకున్నా
అద్దు మీరీ ప్రవర్తిస్తాం
చెట్లను నరికి ప్రకృతిని
పాడుచేస్తున్నాం
ఇది మనుషుల నైజం
కాని ప్రకృతి మాత్రం
ప్రేమను పంచుతునే ఉంటుంది
స్వార్థము లేనిది
ప్రాణ వాయువును ఇస్తుంది
ఆత్మీయతను పంచుతుంది
పచ్చదనంతో అందమైన
ఆనందాన్ని ఇస్తుంది
అందరినీ అక్కున
చేర్చుకుంటుంది
ఇదే ప్రకృతి వైనం
పరోపకారి ప్రకృతి
నిత్యం ఆయురారోగ్యాని
పంచుతుంది
సమస్తానికి నిత్యం
నవజీవన వసంతమే
సేద తీర్చుతుంది
చేయూతనిస్తుంది
ప్రకృతి ప్రసాదించిన
ప్రాణం మనది
ప్రకృతి పెద్ద మానవతా మూర్తి
అందరిని ఆదరిస్తుంది ఆశీర్వదిస్తుంది
నిజమైన ప్రకృతి చిగురిస్తే
మనసంతా పులకరిస్తుంది
చిక్కుల చీకాకుల్ని
దూరంచేసే పెన్నిధి
ఓ నిశ్శబ్ద ప్రేమ ముని
స్వచ్చమైన త్యాగధని
ప్రకృతి లేకపోతే
మనిషి మనగడ లేదు
సహనశీలి
కొండలు కోనలు ప్రకృతి నిలయాలు
నింగికి నేలకు మధ్య
అందమైన పచ్చని పరదాలు
దట్టమైన వనాలు ప్రకృతి అందాలే
ప్రకృతికీ మనిషికీ మధ్య
ప్రాణ సన్నిహితముంది
అన్నీ మరిచిపోయి
తనప్రాణాన్ని తానే
హరించుకుంటున్నాం
అందుకే ప్రకృతిని కాపాడుకుంద్దాం
మన ప్రగతిని నిలుపుకుందాం..
మన ప్రాణాలను
పదిలంగా ఉంచుకుంద్దాం..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
6-9-2020