Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొదట మనం
విముక్తి కావాలి..
తప్పుడు
ఆలోచనలనుండి..
కప్పిపుచ్చుకునే
ధోరణినుండి..
పిరికితనంనుంచి..
పీడితులనుంచి..
సోమరినుంచి..
సోదినుంచి..
భయంనుంచి..
బాధలనుంచి..
విముక్తికావాలి!!....
ఆగ్రహంనుంచి..
ఆవేశంనుంచి..
నిరాశనుంచి..
దురాశనుంచి..
నిట్టూర్పులనుంచి..
నిర్వేదననుంచి..
కోపంనుంచి..
తాపంనుంచి..
విముక్తులంకావాలి!!...
విముక్తి కావడమంటే..
మనకు మనమే
ఓదార్చుకోవడమే!!..
ఓ నిస్పృహలోనుంచి
బయటకి రావడమే!!..
ఇది ఓ అద్భుత
సమిష్టికృషి...
కల్పన ఊహలనుంచి..
భ్రాంతి వలయాలనుంచి..
డబ్బు జబ్బునుంచి..
ఆవేదన అలజడలనుంచి..
గడిచిన బతుకులోనుంచి..
నడుస్తున్న చరిత్రలోనుంచి..
పగబట్టే పాములనుంచి..
పసిగట్టే మనుషులనుంచి..
విముక్తి కావాలి!!...
అశాంతిలో నుంచి..
మనఃశాంతిలోకి రండి!!..
అసంతృప్తిలోనుంచి
సంతృప్తిలోకి..
పగటికలలలో నుండి!!..
చీకటి వలలలో నుండి!!..
ఊహకు అందనివి
విడిచి పెట్టండి!!..
పుకార్ల షికార్ల
దారులను వదలండి..
మనసులేని
మతాలను విడిచి
మమకారం
ఒడిలోకిరండి!!...
భగ్గున మండే
కులాలను విడిచి
మానవత్వపు
దడిలోకి రండి!!...
అప్పుడే
చూపులకందని
నిజమైన జీవితం
కనబడుతుంది!!...
అనుకున్న ఆశయం
మన
ముందుంటుంది..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
7-9-2020