Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవనసీమలో కలం హలంగా చేసుకుని
అక్షరసేద్యం చేసిన కృషీవలుడు కాళోజీ !
"ఒక్క సిరా చుక్క ..లక్ష మెదళ్ల కు కదలిక"
అంటూ సమాజానికి సూచించిన స్ఫూర్తితరంగం కాళోజీ !
తెలుగుతల్లి నుదుటన సింధూరమై
మెరిసిన అక్షరసేనాని కాళోజీ !
కవిత్వమే శ్వాసగా మలుచుకుని
జీవించిన కవి చక్రవర్తి కాళోజీ !
అలోచనల నిండా అభ్యుదయం
ఆచరణే ద్యేయంగా..
కలం కదిలించిన విప్లవకెరటం కాళోజీ !
నిజాం నిరంకుశత్వాన్ని ఎదుర్కొని
ఉద్యమాలకి ఊపిరై..ఊతమై..
నిజాం నియంతృత్వాన్ని నిరసించి
పోరాటాలకు మారు రూపమై
సమరం సాగించిన .. దైర్యవంతుడు కాళోజీ !
పేద,బడుగు,బలహీన పక్షాల నిలిచి
"దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుని దొరలై వెలిగేదెన్నాళ్ళు?"
అంటూ దొరల దురహంకారాన్ని
ఎదిరించి ప్రశ్నించిన చైతన్యం కాళోజీ !
"రవి కైనా అస్తమయం వుంటుందికానీ
కవి మాత్రం నిత్య ప్రకాశం..!"
అన్నట్లుగా ప్రజల హృదయాలలో వెలుగై
జన హృదయ రారాజై..
కీర్తిశిఖరమై ..ప్రజ్వరిల్లిన ప్రజాకవి కాళోజీ !
కాకతీయ విశ్వవిద్యాలయం నుండి "కళాప్రపూర్ణ"..
భారత ప్రభుత్వం నుండి " పద్మ విభూషణ్ "పురస్కారాన్ని..
అందుకున్న సాహితీ సృజనకారుడు కాళోజీ !
తెలుగు తల్లి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహాకవి
ఆధునిక తెలుగు సాహిత్యకారుడు కాళోజీ !
- గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
జి. నాగ మోహన్ కుమార్ శర్మ
gorrepatisrinu38@gmail.com
9652832290