Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఔను..ఇది నిజంగా నిజమే
వేయి గొంతుకల పీఠిక అయ్యింది,
మన కాళోజి రాసిన అక్షరాల రాసులన్నీ..!
నేనేమో అనుకున్నా..
భాషా, యాస కూడా ఉంటదా అని..
ఔను ఇది నిజమే..
ఒకటి బడి పలుకుల భాషా
రెండోది పలుకుబడుల భాష
అని తెల్సింది..
పలుకు బడుల భాష గావాలె
అని పట్టుబట్టి రాసిండు..!
కాళన్న కలలుగన్నడు అప్పుడే
తెలంగాణా కొట్లాటకు
పుట్టుక, చావుకాదు..
బతుకంతా తెలంగాణాకే
ఇచ్చేయాలని..!
నిజామోని గుండెల
కలంతో గుణపం దింపిన,
గుండె ధైర్యం ఉన్నోడని
పాలకులు 'పద్మవిభూషణ్' ఇచ్చి
కాళ్లు ముక్కిన్రు అప్పట్లనే !
కోపమొచ్చిన నిజాము
నగరం నుంచి ఎల్లగొట్టి,
జైలుపాలు జేసినా..
అన్యాయాన్ని ఎదిరిస్తే
నాగొడవకు సంతృప్తి,
అన్యాయం అంతరిస్తే
నాగొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్నేదిరించినోడే
నాకు ఆరాధ్యుడు
అని తిరగబడ్డడు కాళోజి.. !
-రాసపాక వెంకటాచలం,
ఉపాధ్యాయుడు,
ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
చరవాణి :9440564780.