Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి: నమస్తే నమస్తే ప్రజాకవి
జోహార్ జోహార్ ఉద్యమజీవి
నువు తెలంగాణ సాహిత్యపు సింగిడి
నువు స్వరాష్ట్ర సంగ్రామపు సారథి
అందుకో మా కాళోజి... (2)
మా అక్షరసుమ నివాళి (2) ||నమస్తే-ఉద్యమజీవి||
చరణం 1: తెలంగాణ యాసలనే రచన చేసినౌ
జీవభాష మనదని చాటి చెప్పినౌ
రాజకీయ కుట్రల్ని బయలుపర్చినౌ
చెమట పట్టించే చరమగీతి పాడినౌ
ఓ ప్రజాకవి నీవు నిలిచి తీరుతావు (2)
వందలయేండ్లు మా గుండెల నిండా ||నమస్తే-ఉద్యమజీవి||
చరణం 2: అన్యాయం పై తిరుగుబాటు బావుటావు
వివక్షత వైపు విప్లవ గొంతుకవు
నిజామోని మీద నిప్పులు చెరిగావు
నిజం దిక్కె నిత్యం నిలబడి ఉన్నవ్
ఓ ప్రజాస్వామ్యవాది ప్రజల గొడవే నీది (2)
అందుకే అయినవ్ మాకు ఆరాధ్యుడివి ||నమస్తే-నివాళి||
- కార్తీక రాజు
హన్మకొండ, వరంగల్ అర్బన్ జిల్లా
8977336447